District News

ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ సాధనకు విశాఖ జిఎంవిసి గాంధీ విగ్రహం వద్ద 'సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌-సేవ్‌ విశాఖ' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణకు పూనుకుందని, రైల్వే జోన్‌ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించకుండా 10 నుంచి 20 శాతం షేర్లను విక్రయించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించడానికి వెళ్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను విజయవాడ రైల్వే స్టేషన్ లో కలిసి సంఘీభావం తెలుపుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు,కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మరియు సిఐటియు నాయకులు..

కేంద్ర ప్ర‌భుత్వం వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు విజ‌య‌వాడ‌లో నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌ చేపట్టారు. నెలకు 4 రూపాయల చొప్పున గ్యాస్ రేటు పెంచడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్యాస్ పై సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో దళితులపై పలు విధాలుగా జరుగుతున్న దాడులు, కులవివక్ష, దళితుల భూముల్ని లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పది వామపక్షాలు రాష్ట్ర సదస్సు నిర్వహించాయి. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరాపల్లి తదితర గ్రామాల్లో అనేక దశాబ్దాలుగా సాగు చేస్తున్న దళితుల భూముల్ని 'నీరు-చెట్టు' పేరుతో ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకోవడం, పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రులో దళితులపై గత మూడు నెలలుగా సాంఘిక బహిష్క రణ చేయడం, చిత్తూరు జిల్లాలో మహాభారతం పేరుతో సాగే ఉత్సవాల్లో దళితుల పట్ల వివక్ష కనబర్చడం వంటి చర్యలపై ఈ సదస్సులో చర్చించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఇతర...

దేవరపల్లి దళుతుల భూపోరాటానికి మద్దతుగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వి, రాష్ట్ర కమిటి సభ్యులు సిద్దయ్య తదితర స్థానిక నాయకులు పర్యటించారు. దళితుల భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని,70 సం|| రాలుగా దళితులు  సాగుచేసుకున్న భూమి వారికే దక్కేవరకూ సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.   

హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నేడు విద్యార్థులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియచేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు తెలిపారు..విద్యార్థులు కోరుతున్న విధంగా మెస్ చార్జీలను రూ. 750 నుండి రూ. 1500 కు పెంచాలని,హాస్టల్స్ మూసివేతను నిలిపి వేయాలని,సెల్ఫ్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ స్కూల్స్ యాక్ట్ 2017 ను రద్దు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..

విశాఖ ఏజెన్సీలో గిరిజనుల  ఆరోగ్యాలను రక్షించాలని, పి.హెచ్.సిలలో రోగులకు భోజనం పెట్టాలని, సిపియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన కేంద్రాలకు చేయూత నివ్వాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు, విశాఖ జిల్లా కార్యదర్శులు లోకనాధం, గంగరావు  విశాఖ పూర్ణమార్కెట్ వద్ద క్యాంపెయిన్ చేసి వ్యాపారుల వద్ద నుండి  బియ్యం, పప్పులు వగైరా సేకరించారు.

కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలి, సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయని, అదే క్రమంలో రైతులకు కల్పించాల్సిన కనీస మద్దతు ధరను కూడా కల్పించకపోవడం విచారకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. మండలంలోని కాజా గ్రామంలో సింహాద్రి బసవపున్నయ్య జయంతి సందర్భంగా సింహాద్రి శివారెడ్డి మోమొరియల్‌ కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం గ్రామంలోని సుందరయ్య భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపిటిసి ఈదా ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ సుందరయ్య స్ఫూర్తి, సేవా తత్పరితతో శివారెడ్డి, ఆయన కుటుంబం సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ కొనసాగడం ఎంతో అభినందనీయమని...

చిత్తూరు జిల్లాలో దళితులు తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. వివక్ష రూపుమాపేందుకు అధికారయంత్రాంగం చొరవతీసుకోవాలి. లేకుంటే పోరాటం తప్పదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. తనకు కులంపైన నమ్మకం లేదని సిఎం చెబుతున్నారు...మరి సొంత జిల్లాలో కుల వివక్షపై మీ స్పందన ఏమిటని ప్రశ్నస్తున్నాను. కుల వివక్ష ముఖ్యమంత్రికే సిగ్గుచేటు. టిటిడికి ఒకరినయినా ఈవోగా నియమించారా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే టిటిడి ఈవో గా దళితులను నియమించసలి. గతంలో దళితగోవిందం పూజలుచేసిన శ్రీవారి విగ్రహాలను గోదాముల్లో పడేశారు. ఇది వివక్ష కాదా. కబ్జా అయిన దళితుల భూములను తిరిగి వారికి అప్పగించాలి. దళితులను ఆలయాల్లోకి అనుమతించకుంటే మేమే ఉత్సవాలు నిర్వహించి...

తిరుపతిలో  స్మార్ట్ సిటీ పేరుతో పారిశుద్ధ్య కార్మికుల కాలనీ తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అశోక్ నగర్ 'స్కావింజర్స్ కాలనీ' లో  స్మార్ట్ సిటీ పేరుతో 250 ఇళ్ళు తొలగించి అపార్ట్ మెంట్ కట్టాలని ప్రయత్నిస్తుండడంతో కాలనీ వాసులు ప్రతిఘటించారు. సిపియం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. కృష్ణయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి తదితరులు కాలనీ వాసులను కలసి వారికి అండగా పోరాడుతామని హామీ ఇచ్చారు 

Pages