పోలవరం ప్రాజెక్ట్ కు ఒక న్యాయం, గండికోట ప్రాజెక్ట్ కు మరొక న్యాయమా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గండికోట ప్రాజెక్ట్ కూడా పోలవరం ప్రాజెక్ట్ మాదిరే ఆంధ్రప్రదేశ్‌లో ఉందని , ఇది ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. కడప జిల్లా కొండాపురం మండలం చౌటపల్లె గ్రామస్థులు, గండికోటనిర్వాసితులు మూడు రోజులుగా చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా ఆందోళన కొనసాగింది. ముంపునకఁ గురైన గ్రామాలకఁ చెందిన ప్రజలతో ధర్నా వద్ద మధు మట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్ కింద ని ర్వాసితులకఁ రూ.10 లక్షలు పరిహారం ఇచ్చారని , గండికోట ముంపు వాసులకు రూ.6.70 లక్షలు పరిహారం అడిగితే ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు.