తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేట నుంచి దివీస్ కంపెనీని తొలిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.కంపెనీని తొలగించకపోతే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తొండంగి మండలం దానవాయిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం నిర్వహించతలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎంరాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.