అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనానికి తీర్మానం చేయాలి:బాబూరావు

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల స్వాధీనానికి అసెంబ్లీలో తీర్మానం చేయా లని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూ రావు డిమాండ్‌ రూ.1200 కోట్ల విలువ చేసే హారు ల్యాండ్‌, కీసరలోని 200 ఎకరాల భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాల న్నారు. బాధితుల కోసం తక్షణమే రూ.2 వేల కోట్లతో ప్రభుత్వమే నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రిగోల్డ్‌ సంస్థకు ప్రభుత్వం అమ్ముడుపోయిందని, అందుకే ఏడాది పాటు కేసును తాత్సారం చేసిందని విమర్శించారు. డిజిపి జెవి రాముడు కూడా నిందితులకు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. పరారీలో ఉన్న నింది తులను తక్షణమే అరెస్టు చేసి, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బాబూరావు డిమాండ్‌ చేశారు.