స‌ర్వేల పేరుతో పేద‌ల ఇళ్ల‌ను తొల‌గిస్తే స‌హించేది లేదు. ఇళ్ళు, ప‌ట్టాలు, ప‌ట్టాలు ఇస్తామ‌న్న ఎన్న ఎన్నిక‌ల వాగ్ధానాన్ని నిల‌బెట్టుకోవాలి.

నగరంలో పేద‌లు నివ‌శించే కాలువ‌క‌ట్ట‌ల‌పై ఇళ్లకు సర్వే పేరుతో ప్రభుత్వం   తొగించేందుకు , పేదల‌ను రోడ్డున పడేసేందుకు కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సిహెచ్‌ బాబూరావు అన్నారు. మంగళవారం సిపిఎం, సిపిఐ నగర కమిటి ఆద్వర్యంలో బుడమేరు మద్యకట్ట ప్రాంతంలో ఇళ్ల సమస్య పరిష్కారం కోరుతూ పాదయాత్రను నిర్వహించారు. బుడమేరు వంతెన వద్ద నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రలో పాల్గన్న సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో బుడమేరు మధ్యకట్ట ఇళ్ళ జోలికి వస్తే సహించేది లేదన్నారు. జనాభా లెక్కులు, ఇతర సర్వే నగరమంతా  చేయకుండా కేవం  కాలువ‌క‌ట్ట‌ల‌పైనే  ఎందుకు చేస్తున్నారో స్పష్ట పరచాల‌న్నారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల తొగింపుకు ప్రభుత్వం పూనుకుంద‌న్నారు.   ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని 296 జీవో తీసుకువచ్చారని, ఆచరణలో మాత్రంపేద ఇళ్లు తొల‌గింపు ప్రభుత్వ ధ్యేయంగా కన్పిస్తోందన్నారు. సుందరీకణ పేరుతో కాలువ‌క‌ట్ట‌ల‌ వెంట పచ్చదనంకు చెట్లు పెంచుతామని, పచ్చని కుటుంబాలు ఉంటున్న ఇళ్లను తొగించే చర్యల‌కు టిడిపి ప్రభుత్వం దిగిందన్నారు. నిజంగా పచ్చదనమే రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటే రాజధానికి మూడు పంటలు పండే పచ్చని భూముల‌ను రైతునుండి లాక్కోని, ముఖ్యమంత్రి పేదల కడుపు కొట్టడమే కావాలా అని ప్ర‌శ్నించారు.  దానికి పచ ్చదనంను వాడుకుంటున్నారన్నారు.సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్‌ మాట్లాడుతూ క్వాగట్ల వెంట ఉంటున్న వారికి ఎక్కడి వారికి అక్కడే గతంలో చేసిన వాగ్దానాల‌ మేరకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు. ఇళ్లు లేని అద్దె దారుకు వెంటనే ఇళ్లు కేటాయించాని డిమాండ్‌ చేశారు.అలా కాకుండా పేద ఇళ్లు క్చూడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంటే ప్రతిఘటించి తీరుతామన్నారు. ఇళ్ల సమస్య పరిష్కారం కోసం ఈ నె 22వ తేదిన జరిగే ఛలో విజయవాడ కార్యక్రమంలో నగరంలోని పేదందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.