ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మరోమారు మొండిచెయ్యి చూపించిందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన 'రాయలసీమ బస్సుయాత్ర' మంగళవారం గుంతకల్లుకు చేరింది. ఆఖరి రోజు కళ్యాణదుర్గంలో ప్రారంభమైన యాత్ర బెళగుప్ప, కణేకల్, ఉరవకొండ, వజ్రకరూరు మీదుగా రాత్రికి గుంతకల్లుకు చేరింది. బుధవారం ఉదయం కర్నూలు జిల్లా మద్దికెరలోకి ప్రవేశిస్తుంది.పలుచోట్ల జరిగిన సభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శ్రీనివాస రావు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన రాయల సీమకు మరో మారు మొండిచెయ్యి చూపిందని విమర్శి ంచారు. మూడో బడ్జెట్‌లోనూ నిధులు కేటా యించే విషయంలో రాయలసీమ ప్రస్తావనే లేద న్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేకపోవడం శోచనీయమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భ వించిందని, చంద్రబాబు ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ మోకాళ్ల ముందు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమా ండ్ చేశారు