ఢిల్లీ జె.ఎన్.యు.లో స్టూడెంట్ అధ్యక్షుడు కన్హయ్ కుమార్‌ను విడుదల చేయాలని, విద్యార్ధులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ, సభ నిర్వహించారు. కళాక్షేత్రం వద్ద నుండి జరిగిన ర్యాలీలో వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభ్యుదయ వాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియచేశారు. విద్యార్దులపై పెట్టిన అ్రకమ కేసులు రద్దు చేయాలని, కన్హయ్ కుమార్‌ను వెంటనే విడుదల చేయాలని, యూనివర్సీటీలలో కేంద్రప్రభుత్వ జోక్యం ఉండరాదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం లెనిన్ సెంటర్‌లో జరిగిన సభలో వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం కావాలనే యూనివర్సిటీలలో ఈ విధమైన గొడవలను ముందుకు తీసుకొన్తున్నదని, విశ్వవిద్యాలయాలను మతోన్మాద కేంద్రాలుగా మార్చాలని చూస్తుందని విమర్శించారు. అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివవర్సీటీలో రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులపై కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. మరో ప్రక్క హేతువాద ఉద్యమ నాయకులు, రచయితలపై దాడి చేసి వారిని హత్య చేసిన వారిపై ఏ విధమై కేసులు పెట్టకపోవడం దారుణమన్నారు. బిజెపి, ఆర్.ఎస్.ఎస్. చర్యలను ఖండిచిన వారిని, వారి చర్యలకు అడ్డుపడిన వారిని దేశద్రోహులుగా చిత్రించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం వుందన్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఈ చర్యలు తిప్పికోట్టాలని, అందుకు వామపక్షాలతో కలిసి ముందుకు రావాలని కోరారు. ప్రజల ఐక్యతను, స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు.