బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 30న చింతపల్లిలో 'గిరిజన గర్జన సభ' నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ ఈ సభలో పాల్గొననున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు తెలిపారు. డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు.
District News
వరద బాధితులకు సిపిఎం అపన్నహస్తం అందించింది. నెల్లూరు నగరంలో బాధితులకు స్వయంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు నేతృత్వంలో సాయం అందజేశారు. నాయకులు నడుముల్లోతు నీళ్లలోనే వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆహారపొట్లాలు, మంచీనీటి ప్యాకెట్లు, కొవ్వొత్తులు అందించారు.ఐదురోజులుగా నగరంలోని సుమారు 30 వేల ఇళ్లు నీటిలోనే ఉండడం పట్ల మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేందుకు సిపిఎం ముందుంటుందన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే వరద సంభవించిందన్నారు. ముందస్తు సమాచారం లేకుండా నెల్లూరు చెరువు గేటు ఎత్తేశారని అన్నారు. కాలువలు ఆక్రమణకు గురికావడం వల్లనే నీరు తియ్యలేదన్నారు....
బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి)కి అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన జిఒ 97, బాక్సైట్ ఒప్పందా లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు తెలిపారు. ఏజెన్సీలో గ్రామ సభలు నిర్వహించడం, అటవీ హక్కులచట్టం కింద సాగుదారులకు హక్కుపత్రాలు మంజూరు చేయడం వంటి డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామ న్నారు. ఎన్‌పిఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి గిరిజను లను మోసగించడం కాంగ్రెస్, బిజెపి, టిడిపికి...
భూదాహం వద్దు
దిష్టిబొమ్మ దహనంలో సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు భూములను కట్టబెడుతోందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని పైకిచెబుతున్నా, లోపల మాత్రం ప్రజల నుండి ఏవిధంగా భూములు లాక్కోవాలో అన్న ఆలోచనతోనే ముందుకు సాగుతోందన్నారు. మచిలీపట్నం భూపోరాటంపై ప్రభుత్వ నిర్బంధం నశించాలని, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పటమట ఎన్‌టిఆర్ సర్కిల్ వద్ద ఆదివారం ఉదయం 'భూముల్ని తినే తోడేలు' దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రజలను ఇబ్బందులు గురిచేయకుండా అవసరమైన మేరకే...
ఒప్పంద కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా రియల్ ఎనర్జీ సంస్థకు నగర పాలక సంస్థ డబ్బులు చెల్లించడం విడ్డూరంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 30తో గడువు ముగిసినా కౌన్సిల్ తీర్మానం లేకుండానే ఏకపక్షంగా ఒప్పంద కాలపరిమితిని పొడిగించారని విమర్శించారు. అధికార టిడిపి ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిడితో అడ్డగోలుగా కోట్లాది రూపాయలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 41 శాతం మేర విద్యుత్ ఆదా చేసేందుకు 2014 ఆగస్టు 14వ తేదీ వరకూ వీధిలైట్ల నిర్వహణ రియల్ ఎనర్జీ సంస్థ కాంట్రాక్ట్ తీసుకుందని, కానీ ఆ రీతిలో విద్యుత్ ఆదా చేయలేదని తెలిపారు. అయినా 2007 నుండి...
తిరుపతి శివారు ప్రాంతంలో 20 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని చిత్తూరు ఎంపి శివప్రసాద్ కబ్జాకు పాల్పడ్డారని వామపక్షాల నేతలు తెలిపారు. అధికారం ఉందన్న గర్వంతో పేదలకు పట్టాలిచ్చిన భూముల్లో ఎంపి పాగా వేయించారని.. తక్షణం ఆక్రమణను ఆపాలని డిమాండ్ చేశారు.
బందరుపోర్టు, పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లోనే నిర్మించాలని కోరుతూ కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలంలో శనివారం జరిగిన 'మీ ఇంటికి...మీ భూమి కార్యక్రమంలో అరెస్ట్ చేసిన భూపరిరక్షణ కమిటీ కన్వీనర్ కొడాలి శర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చౌటపల్లి రవి, పోతేపల్లి ఎంపిటిసి పిప్పళ్ళ నాగేంద్రబాబులు బెయిల్‌పై మచిలీపట్నం స్పెషల్ సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. ఎక్సైజ్ శాఖ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కృష్ణాజిల్లా బందరు మాజీ శాసనసభ్యులు, వైసిపి నాయకుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)కి బుధవారం బెయిల్ లభించింది.
నెల్లూరులో వరద గ్రామాలలో సిపిఎం సహాయకచర్యలు చేపట్టింది. గ్రామా గ్రామాన వరదల్లో చిక్కుకున్న వారికి సహాకారం అందించడంతో పాటు ఆహారపొట్లాలను అక్కడి సిపిఎం కార్యకర్తలు పంపిణి చేస్తున్నారు ..వరదలవలన నష్టపోయినవారిని ఆదుకోవడం కోసం చేయి చేయి కలపాలని కోరుతున్నారు.
రాజధాని అభివృద్ధి పనులు చేపట్టడానికి తాడేపల్లి పురపాలక సంఘ పరిధిలోని రిజర్వు ఫారెస్టు ఏరియాని సీఆర్‌డీఏకు ఇచ్చేందుకు కౌన్సిల్ ఆమోదించింది. తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న రిజర్వు ఫారెస్టు ఏరియాలో 1032 నివాసాలు ఉన్నాయని, వాటన్నింటినీ క్రమబద్ధీకరణ చేయాలనీ కౌన్సిల్ తీర్మానించింది. అలాగే, ముఖ్యమంత్రి అతిథి గృహానికి వెళ్లే దారిలో వర్క్‌షాపు వైజంక్షన్ వద్ద రూ.14లక్షల 50 వేల వ్యయంతో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడానికి రూపొందించిన అంచనాలను ఆమోదించారు.
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు, ప్రజాతంత్ర వాదులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజన ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ఉద్యమం యొక్క తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని బాక్సైట్ తవ్వకాల జి.వోను వెంటనే రద్దు చేసేలా 16న జరిగే రాష్ట్ర క్యాబినేట్‌లో నిర్ణయం చేయాలని సిపియం పార్టీ డిమాండ్ చేస్తుంది. లేనియెడల సిపియం పార్టీ ప్రజా సంఘాలు, సంస్థలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడే ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని విశాల ఉద్యమానికి సన్నిద్ధం అవుతుంది.
బాక్సైట్ తవ్వకాలు చేపడితే జికెవీధి, చింతపల్లి, అరకు, అనంతగిరి మండలాల్లోని 247 గ్రామాలు, 9312 ఆవాసాలకు...