District News

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖ అనుమతులు ఇవ్వడం దారుణమని, దీనిని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకులు ప్రజలను మభ్య పెట్టారనే విషయం ఈ జీవోతో వెల్లడైందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం బాక్సైట్‌ తవ్వకాలకు మార్గం సుగమం అయిందని, ఈ జీవోలో 1212 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలు చేపడితే దానికి రెట్టింపు హెక్టార్లలో మొక్కలు నాటాలని చెబుతున్నారని అన్నారు. టిడిపి, బిజెపి ప్రభుత్వాలు మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రైవేటు వ్యక్తులకు సర్వ హక్కులూ ఇస్తున్నాయని, బాక్సైట్‌ వల్ల ప్రభుత్వానికి...

గన్నవరంలోని ఐటి పార్కు (మేధా టవర్స్‌)ను సెక్రటేరియట్‌గా ఉపయోగించుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వ చ్చే ఏడాది ప్రభుత్వ కార్యాలయాలు దీనిలో ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వం సూచాయిగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు మంత్రివర్గ నిర్ణయంతో అది కార్యరూపం దాల్చినట్లయింది.

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వ మరోసారి మాట తప్పింది. వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో పొలాలున్న రైతులకు కోరిన రెవెన్యూలో ఒకేచోట స్థలం కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం అటువంటిదేమీ లేదని ప్రకటించింది. కుటుంబంలో ఒకే గ్రామ పరిధిలో వేర్వేరు పేర్ల మీద ప్లాట్లు ఇచ్చిన యజమానులు ఒకే చోట భూములు కావాలనుకుంటే ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. జనవరి రెండోతేదీన నేలపాడులో పూలింగు ప్రక్రియ ప్రారంభించారు. అప్పట్లో వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో భూములున్న రైతులు తమకు ఒకేచోట భూములు కావాలని కోరారు. దీనికి మంత్రులు అంగీకరించారు. వేర్వేరు చోట్ల భూములున్న వారందరూ తహశీల్దార్‌కు తమ అంగీకార పత్రాలు సమర్పించాలని, వారందరికీ కోరుకున్న...

బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ల కోసమే ప్రభుత్వం భూ బ్యాంకు పేరిట భూములను బలవంతంగా సేకరిస్తోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అన్నారు. కడప జిల్లా బద్వేలు నియోజక వర్గంలో భూబ్యాంక్‌ కింద 36 వేల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూముల్ని తీసుకున్న గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఒక్క కడప జిల్లాలోనే భూ బ్యాంకు కోసం 1.23 లక్షల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందన్నారు. ఈ విధానాన్ని రైతులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేటర్లకు చౌకగా కట్టబెట్టేందుకే జిల్లాలో 33 మండలాల్లో పేదలు, రైతులకు చెందిన భూముల్ని సేకరిస్తోందని విమర్శించారు.

కృష్ణాజిల్లా మైలవరం అయ్యప్పనగర్‌లో సిపిఎం మైలవరం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భూ పోరాటం జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.వి.ఆంజనేయులు నేతృత్వంలో పేదలు తమకు ఇళ్ల స్థలాలివ్వాలని కోరుతూ 9.43 ఎకరాల భూముల్లో గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని నాయకులను అరెస్టు చేసి స్థానిక స్టేషనుకు తరలించారు. అరెస్టులపై ఆగ్రహించిన పేదలు అక్కడి నుంచి ప్రదర్శనగా వచ్చి తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించి నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

అసంఘటిర రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గపూర్‌ డిమాండ్‌ చేశారు. అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మజుందార్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో గపూర్‌ ముఖ్య వక్తగా విచ్చేసి మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు పెంచిన వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. 

భూసేకరణకు ప్రభుత్వం సమాయత్తం కావడంతో కృష్ణానది చెంతనే ఉన్న లంక భూముల్లో రాజకీయ నాయకులు రాబందుల్లా వాలిపోతున్నారు. భూయజమానులను నయానో, భయానో బెదిరించి వారి నుంచి బినామీ పేర్లతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. తక్కువ డబ్బు ముట్టచెబుతూ సొంతం చేసుకుంటున్నారు. సేకరణకు ఉద్దేశించిన భూముల్లో జరీబు, అసైన్డ్‌ భూములున్నాయి. జరీబు భూములకు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అసైన్డ్‌ భూములకు బినామీ పేర్లలో పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ లావాదేవీల్లో అధికార పార్టీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. నోటిఫికేషన్‌ ద్వారా భూ సమీకరణకు ప్రభుత్వ సిద్ధం కావడంతో ఎకరం 5 లక్షల రూపాయల విలువ ఉన్న భూములకు 25 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. పట్టా భూములను ఎకరం 45...

చంద్రబాబు ప్రభుత్వంపై విశాఖ జిల్లా  సీపీఎం కార్యదర్శి లోకనాధం ఆగ్రహం వ్యక్తం చేసారు. భూసేకరణ పేరుతో భూమాఫియాను ప్రభుత్వం తయారు చేస్తుందని మండిపడ్డారు. 2005లో నావెల్‌ బెస్‌ స్పెషల్‌ ఆపరేషన్ పేరుతో 4,100 ఎకరాలు సేకరించి 10 ఏళ్లవుతున్నా నేటికి 5 లక్షల పరిహారం చెల్లించలేదని ధ్వజమెత్తారు. మత్స్యకారుల సంపదను దోపిడి చేస్తూ కోస్టల్‌ తీరాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. 

                నేవల్‌ ఆల్టర్నేట్‌ ఆపరేటివ్‌ బేస్‌ (ఎన్‌ఎఒబి) పేరుతో 2005లో ఎస్‌.రాయవరం, రాంబిల్లి మండలాల్లో 4412.53 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అందులో వేల్పుగుంటపాలెం, రేవువాతాడ, దేవళ్లపాలెం, పిసినిగొట్టిపాలెం గ్రామాల నిర్వాసితులకు ఎన్‌ఎఒబి కాలనీ పేరుతో 373 మందికి ఇళ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో  మిగిలిన 34 మందికి దిబ్బపాలెం ఆర్‌హెచ్‌ కాలనీ ఇళ్లు కేటాయింపు జరిగాయి. మొత్తం 407 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. వీరు కాకుండా బంగారమ్మపాలెం, కొత్తపట్నం, వాడనర్సాపురం, యాతకొత్తపట్నం, కొప్పిగుంటపాలెం గ్రామాలను ప్రభావిత గ్రామాలగా గుర్తించారు. కానీ నేటికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వం అంగీకరించిన నష్టపరిహారం చెల్లించలేదు. నేవల్‌ బేస్‌ నుండి...

Pages