పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా వామపక్షాలు నిరసన గళమెత్తాయి. ధరలను నియంత్రించకపొతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని, ప్రజాప్రతిఘటన తప్పదని హెచ్చారించాయి. రాష్ట్ర వ్యాపితంగా అధిక ధరలకు నిరసనగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు సోమవారం జిల్లా వ్యాపితంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్‌డిఎ, రాష్ట్రంలో టిడిపిలు ఎన్నికల ముందు వంద రోజుల్లో ధరలు నియంత్రిస్తామని ప్రగల్బాలు పలికి, నేడు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోవట్లేదన్నారు. కందిపప్పు, బియ్యం, చింతపండు, ఉల్లిపాయలు,...
District News
కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ హెచ్చరించారు. సిఐటియు పశ్చిమగోదావరి జిల్లా పదో మహాసభల ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గఫూర్ మాట్లాడారు. పారిశ్రామిక ప్రగతిని స్వాగతిస్తున్నామని, ఈ పరిణామంలో కార్మిక చట్టాలకు విఘాతం కలిగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్మికుల ఐక్యత దెబ్బతీయడానికి ఐదు కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ విశాఖ నగరంలోని మేథావులు, రచయితలు, కళాకారులు సోమవారం ప్రదర్శన నిర్వహించారు.ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ, దేశంలో వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గొడ్డు మాంసం తిన్నవాళ్లు ఈ దేశంలో ఉండొద్దని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను అవమానించడమే అవుతుందన్నారు.
ప్రత్యేక హోదా సాధించేవరకు నిరంతరం పోరాటం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో మట్టి సత్యాగ్రహాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది చేత మట్టిని సేకరించి మోదీకి పంపుతామని రఘువీరారెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ధరలు భగ భగ మండిపోతున్నాయని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు నిరసనగా వామపక్షాలు విశాఖ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఎం నేత సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ 16 నెలల క్రితం ధరలు తగ్గిస్తామని అధికారంలోకి చంద్రబాబు వచ్చారని గుర్తు చేశారు. కానీ ధరలను విపరీతంగా పెంచేశారని, ఇందులో పోషకాహార సరుకులు కూడా ఉన్నాయన్నారు. పలు కంపెనీలు పప్పులు నిల్వ చేసుకుంటుంటే వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజినివ్వాలని సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి సుజాతనగర్‌లోని ప్రయివేటు కల్యాణమండపంలో వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యాన ఆదివారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకు, ప్యాకేజికి తేడా ఉందన్నారు. ప్రత్యేక హోదానిస్తే కేంద్రం నుంచి 10 శాతం నిధులు, 90 శాతం గ్రాంట్లు వస్తాయన్నారు. పట్టిసీమపై ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్రపై లేదని, సుజలస్రవంతిని విస్మరించారని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టిన మోడీకి బీహారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారని విమర్శించారు.
రాజధానికి శంకుస్థాపన జరిగిన గ్రామాల్లో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. పేదలకివ్వాల్సిన పెన్షన్లు ఎగ్గొట్టేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఇటీవల నిరు పేద దళితులకు పొలాలున్నాయంటూ పెన్షన్లు ఆపేశారు. ఈ సమస్య శంకుస్థాపన చేసిన గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. పేద దళితులకు కనీసం పని కూడా కల్పించటం లేదు. వారిలో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తమకు పొలాలు లేకపోయినా ఉన్నాయనే పేరుతో పెన్షన్లు ఎత్తేశారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలినెలలో అర్హులుగా గుర్తించి, రెండోనెల నుండి పింఛన్లు ఇవ్వడం లేదని, అదేమంటే తమకు పొలాలున్నాయని అంటున్నారని పేదలు వాపోతున్నారు. పొలాలు ఎక్కడున్నాయో చెబితే దానికి తగిన...
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్వంలో నెల్లూరు డిఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.దోమల నుంచి రక్షించండి, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, డెంగ్యూ, విషజ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ మాట్లాడుతూ జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే పాలకులు, అధికారులు కబోది పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందడంలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు లేవని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వామపక్షాలు విజయవాడ లెనిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. ప్రభుత్వం పన్నుల విధానంలో మార్పు తీసుకురావడం వల్ల ధరలు పెరిగిపోయాయన్నారు. రైతు దగ్గర నుండి తీసుకున్న ధరకు నిమిత్తం లేకుండా అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తయారు చేసిన జీఎస్టీ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని, దీనిని...