District News

కార్మికుల మెడలపై కత్తి వేసే విధంగా ఉన్న ప్రభుత్వ విధానాలను తిప్పకొట్టడానికి ఐక్య పోరాటాలే శరణ్యమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు. బుధవారం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గుహల ఆవరణంలో నిర్వహించిన సిఐటియు రాష్ట్ర స్థాయి క్లస్టర్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను సవరిస్తూ, ప్రయివేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. గత కార్మిక చట్టాల్లో ఎనిమిది గంటల పని దినాలు ఉన్నా, వాటిని ప్రయివేటు యాజమాన్యాల లాభాల కోసం బిజెపి సవరించి తీరుతామని చెప్పడం విడ్డూరమన్నారు.

పంటలు పండే పచ్చటి పొలాలను, ప్రజల జీవితాలను నాశనం చేసే ఆక్వా ఫుడ్‌పార్క్‌ నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి, గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న రైతులతో మాట్లాడారు. జనావాసాల ప్రాంతంలో గోదావరి మెగా ఫుడ్‌పార్క్‌ ఫ్యాక్టరీ నిర్మించొద్దని ఏడాదిగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పముజుల దశరథరామయ్యపై నెల్లూరు రూరల్‌ మండలం సౌత్‌మోపూరులో మంగళవారం హత్యాయత్నం జరిగింది. గ్రామ పంచాయతీ చేపట్టిన డ్రైనేజీ కాలువ నిర్మాణ విషయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. రూ.5లక్షలతో పంచాయతీ డ్రైనేజీ కాలువ నిర్మిస్తోంది. అయితే, హైస్కూల్‌ కూడలిలో స్థానికంగా నివాసముండే బట్టేపాటి ప్రతాప్‌ కాలువ తమ స్థలంలో ఉందంటూ నిర్మాణ పనులను అడ్డుకున్నాడు. గ్రామపెద్దలు, సీపీఐ సీనియర్‌ నేత పముజుల దశరథరామయ్య జోక్యం చేసుకుని డ్రైనేజీ కాలువ పూర్తిగా పంచాయతీ స్థలంలో ఉందని, రెవెన్యూ సర్వే ప్రకారమే నిర్మాణం జరుగుతోందంటూ తేల్చి చెప్పారు. అయినా మాటవినని ప్రతాప్‌ పముజులపైకి దూసుకెళ్లాడు. గడ్డపారతో దశరథరామయ్యను పొడిచేందుకు ప్రయత్నించగా...

 ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రత్యామ్నాయ వైద్య సదుపాయాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ నరసింగరావు డిమాండు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవల డెంగీతో మృతి చెందిన జయశ్రీ,ఇషాంక్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో తమ బిడ్డలకు సరైన వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందారని బాధిత తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు .  చిత్తూరు జిల్లాలో మూడు నెలల వ్యవధిలో డెంగీతో 20 మంది మృతి చెందారని, ఇతర జ్వరాలతో లక్షా 44 కేసులు నమోదైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 

అన్నదాతలెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, సంఘటితంగా పోరాడదామని అఖిల భారత కిసాన్‌ సభ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్‌ పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా సుమారు 3.20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోడీ పాలన చేపట్టాక రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా 450 పైచిలుకు బహిరంగ సభల్లో నరేంద్ర మోడీ రైతులపై వరాల జల్లు కురిపించారని, అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఆయన అసలు బండారం బయటపడిందని...

అసెంబ్లీ శీతాకాల సమావేశాల కోసం రాజధాని ప్రాంతం తుళ్లూరులో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాలతోపాటు, శాసనమండలి సమావేశాలూ తుళ్లూరులోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

 పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కు ంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ సర్వే చేసిన గ్రామాల్లో సోమవారం సిపిఎం బృందం పర్యటించింది. అధైర్య పడవలసిన అవసరంలేదని, రైతులకు సిపిఎం అండగా నిలుస్తు ందని భరోసా ఇచ్చారు. అనంతరం వైవి మాట్లాడు తూ, రాష్ట్రంలో జిల్లాకు లక్ష చొప్పున 13 లక్షల ఎకరాల భూమిని భూ బ్యాంకు పేరుతో ప్రభు త్వం లాక్కుంటోంద న్నారు. దొనకొండలో అధికా రులు చేసిన సర్వేపై సరైన పరిశీలన లేకుండానే 25 వేల ఎకరాలను తీసుకునేందుకు రంగం సిద్ధం చేయ డం సరికాదన్నారు. గత ప్రభుత్వం భూ పంపిణీలో ఇచ్చిన వాటిని...

రాజధాని శంకు స్థాపనకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడి ప్రత్యేక తరగతి హోధాపైగానీ,ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజిపైగాని, విభజన హామీలపైనా పల్లెత్తు మాట కూడ మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ సిపియం ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. దహానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు వీఫలయత్నం చేశినా నాయకులు పట్టు వదలకుండా దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలొ తెలిపిన నిరసనను పోలీసులు అడ్డుకున్నందుకు శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడూతూ ప్రధాని మోడి రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్థాడని ప్రజలు ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకహోదా పైనా, ఆర్ధికంగా,...

నవ్యాంధ్ర రాజధానిలో భూములు కోల్పోయిన రైతుల ఇబ్బందులు ఒక పక్క, ప్రభుత్వ రాజధాని నిర్మాణం ఆడంబరం మరోపక్క, పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు ఇంకోపక్క ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తాడేపల్లి లో నిర్వహించిన సిపిఎం నాయకులు మేకా అమరారెడ్డి 34వ వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. సభకు సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటే శ్వరరావు అధ్యక్షత వహించారు. బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా 4వేల ఎకరాల్లో వచ్చే పదేళ్లలో రాజధాని నిర్మాణం చేస్తానని చెబుతున్న నేపథ్యంలో రైతుల నుండి 33వేల ఎకరాలు సేకరించి మొత్తం లక్ష ఎకరాలు భూములు సేకరించడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం...

మ‌న్యంలో మ‌లేరియా, ఇత‌ర విషజ్వ‌రాల‌ బారిన పడిన అనేక మందికి ఉచిత వైద్య సేవలందించడానికి చింతూరులో  సిపిఎం ఆధ్వర్యంలో  ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి నెల రోజుల నుండి సేవా కార్య‌క్ర‌మాలు కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాల‌యాన్ని ప్ర‌జా అవ‌స‌రాలు తీర్చి, ప్రాణాలు నిల‌బ‌ట్టే వైద్య‌శాల‌గా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్  మిడియం బాబూరావు సార‌ధ్యంలో జేవీవీ, ఇత‌ర ప్ర‌జా రంగాల వైద్యులు, నెల్లూరు ప్ర‌జావైద్య‌శాల‌కు చెందిన వైద్యులు కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చి సేవ‌లు అందించారు. సెరిబ్ర‌ల్ మ‌లేరియాతో వ‌ణుకుతున్న గిరిజ‌నుల‌ను ఆదుకుని వారి ప్రాణాలు నిల‌బెట్టిన ఈ శిబిరానికి ప‌లువురు స‌హాయం అందించారు.

Pages