హుదూద్ ఏడాది సంబరా లను విశాఖలో జరిపిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు నష్టపరి హారంపై సమాధానం చెప్పకుండా దాటవే యడం సిగ్గుచేటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్. నర్సింగరావు వ్యాఖ్యానిం చారు.విశాఖ స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై బహిరంగ విచారణకు సిద్ధమేనా? అంటూ సవాల్ చేశారు. తుపానులో ఇళ్లు కోల్పోయిన అత్యధిక మంది బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోగా, దాతలిచ్చిన విరాళాలతో కూడా ఇళ్లు నిర్మించకుండా ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. అత్యధిక మంది మత్స్యకారులకు, గిరిజనులకు, రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వలేదన్నారు.
District News
బిసి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌లిమిటెడ్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం లో నిర్మించ తలపెట్టిన ఎరువులు, రసాయనాల కర్మాగారంపై గురువారం నాడు ఫార్సుగా ప్రజాబి ప్రాయ సేకరణ జరిగింది. ప్లాంటుకు సంబంధిం చి నామమాత్రపు వివరాలు కూడా ఇవ్వకుండా అభి ప్రాయాలు సేకరించడంపై తీవ్రస్థాయిలో విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమీప బంధువులకు ఈ ప్లాంటులో భాగస్వామ్యం ఉండటంతో హడావిడిగా ఈ తంతు ముగించా రన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ టెక్నాలజీ ఉపయోగిస్తారో, ఎవరి నుండిసాంకేతిక సహకారం తీసుకుంటున్నారో వంటి అంశాలను కూడా ప్రజల కు వివరించకపోవడం గమనార్హం.
ఇంటర్‌నెట్‌నుండి కాపీ ఈ కంపెనీ తయారు చేయించిన ఎన్వి రాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఇ ఐ...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు పీడిత ప్రాంత మైన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యం లో పెద్దఎత్తున కడప కలెక్టరేట్ను ముట్టడించారు.ధర్నాకు వస్తున్న ప్రజలనూ, పార్టీ కార్యకర్తలనూ, నాయకులనూ పోలీ సులు అడ్డుకుని అరెస్టులు చేశారు. ధర్నానుద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ మాట్లాడుతూ..రాయలసీమలో విద్య, ఉపాధితోపాటు వర్షాలు లేక అన్నిట్లోనూ వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిషన్ తన రిపోర్టులో పేర్కొందని గుర్తు చేశారు. కడప జిల్లాకు రూ.50 కోట్లు ఇచ్చామని చెపుతున్నారని, ఈ మొత్తం పడిపోయిన స్కూల్ బిల్డింగులు రిపేరు చేయడానికి కూడా చాలవని విమర్శించారు. రాయలసీమ ప్రాంత సమ స్యల పరిష్కారం కోసం...
రాజధాని నిర్మాణం పూర్తిగా కార్పొరేట్ల కోసమే చేస్తున్నట్లుందని, రైతుల ప్రస్తావన, వారి సంక్షేమం కనిపించడం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలను గ్రీన్‌ఫీల్డు పేరు తో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుం డా ఏకపక్షంగా ముందుకు వెళుతూ వ్యాపార రాజధానిగా మారుస్తున్నారన్నా రు. రాజధాని కార్పొరేట్ల కోసమా ? ప్రజల కోసమా ? అనే అంశంపై బుధవారం వేదిక ఫంక్షన్ హాల్లో సిపిఎం ఆధ్వర్యాన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ వ్యాపారం కోసమే రైతుల వద్ద వేల ఎకరాల భూములు తీసుకున్నారని తెలిపారు. వారి లాభాల కోసం రాజధాని చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల భూములను గ్రీన్‌ఫీల్డుగా మార్చారని...
ఉత్తరాంధ్ర, ప్రధానంగా విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన హుదూద్ విలయం సంభవించి సరిగ్గా ఏడాది. ఆ ప్రచండ తుపాను ప్రాంతాల పునర్నిర్మాణం, బాధితుల సహాయ, పునరావాసాలపై నాడు ప్రభుత్వం గుప్పించిన హామీలపై వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. కంటి తుడుపు చర్యలు, ప్రచార్భాటం తప్ప ఒక్క పటిష్ట, శాశ్వత చర్య లేదుగాక లేదు. వినాశనం నుంచి ప్రజలు స్వంతంగా శక్తినంతా కూడదీసుకొని కుదుట పడ్డారు మినహా ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనా దక్షత, కొండంత మనసు వలన హుదూద్ బాధితుల జీవితాల్లో కాంతులు విరజిమ్మాయంటున్న అనుకూల మీడియా కథనాలు వంచనా శిల్పాలు. తుపానుతో ఛిద్రమైన విశాఖ మురికివాడలను, మత్స్యకార...
వామపక్ష, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ ప్రత్యక్ష భూ పోరాటాలకు సన్నద్ధం కావాలని ఎపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని సంఘాలతో భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29న విజయవాడలో రాష్ట్ర స్థాయి భూ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఇక్కడ దాసరి భవన్‌లో వామ పక్ష రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడాన్ని ఖండించారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్, ప్రభుత్వ భూములకు అన్ని హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం,...
విశాఖ జిల్లా గ్రంథాలయ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ డిమాండ్‌చేశారు. ఈ మేరకు మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు మౌనదీక్ష చేపట్టారు. ఎయు మాజీ వీసీ ప్రొఫెసర్ కెవి రమణ దీక్షను ప్రారంభించగా, పౌర గ్రంథాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు బిఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సాగిన దీక్షను పలువురు ప్రముఖులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజరుశర్మ మాట్లాడుతూ, స్వార్థం కోసం కనీస విలువలు పాటించకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ పదవులు పొంది ప్రభుత్వ స్థలాలను...
సంఘటితంగా ఉద్య మించి ఇళ్ల పట్టాలు, రిటైనింగ్ వాల్ నిర్మాణం సాధించుకోవాలని, లేకపోతే ఈ ప్రభుత్వం ఉన్న గూడును కూడా ఉండనిచ్చే పరిస్థితి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానం మేరకు కృష్ణాకరకట్ట నివాసుల పరిరక్షణకై రిటైనింగ్‌వాల్ నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో రామలింగేశ్వర్‌నగర్‌లోని తారకరామా నగర్, ఇతర ప్రాంతాల్లో సోమవారం పాదయాత్ర చేశారు. బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో కృష్ణాకరకట్ట పరివాహక ప్రాంత పరిధిలోని 8.5 కిలోమీటర్ల పరిధిలో పేదలు నివాసాలుండే గృహాలను తొలగించాలన్న ప్రభుత్వం యోచనను అందరూ సంఘటితంగా తిప్పికొట్టాలని కోరారు. ఇప్పటికే భవానీపురం ప్రాంతనివాసులకు కార్పొరేషన్ అధికారులు...
పర్యావరణ అనుమతులు లేని కారణంగా రాజధాని పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు లను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. తోటలను కూల్చివేయడం, పొలాలను చదును చేయడం, శంకుస్థాపన పేరిట తాత్కాలిక నిర్మాణా లను చేపట్టడం వంటి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులతో పాటు, ఉన్నతస్థాయి అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌జిటి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తుండటం పట్ల పర్యావరణ వేత్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సర్కారుపై ధిక్కార కేసును దాఖలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ దిశలో అవసరమైన ఆధారాలను ఇప్పటికే సేకరించారు. పర్యావరణ ఉల్లంఘనలతో పాటు అనేక చట్టపరమైన అవకత వకలతో ఉన్న రాజధాని శంకుస్థాపనకు...
విజయవాడ మాంటిస్సోరి కళాశాల ఆడిటోరియంలో ఈనెల 12, 13 తేదీల్లో రెండు రోజులపాటు మహిళా టీచర్ల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ఇచ్చిన ప్రాథమిక విద్యనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్య కోసం అదనంగా రూ.80 వేల కోట్లు ఖర్చు చేయాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( ఎన్‌సిఇఆర్‌టి ) చెప్పినా, ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తితో కాకుండా, వ్యాపార దృష్టితో విద్యను అందిస్తోందన్నారు. మహిళలను వ్యక్తిగత ఆస్తిగా చూడటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, వాటి పరిష్కారాలకై...