రాజధాని పనులను నిలిపివేయండి:NGT

పర్యావరణ అనుమతులు లేని కారణంగా రాజధాని పనులను నిలిపివేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు లను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. తోటలను కూల్చివేయడం, పొలాలను చదును చేయడం, శంకుస్థాపన పేరిట తాత్కాలిక నిర్మాణా లను చేపట్టడం వంటి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులతో పాటు, ఉన్నతస్థాయి అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌జిటి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తుండటం పట్ల పర్యావరణ వేత్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సర్కారుపై ధిక్కార కేసును దాఖలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ దిశలో అవసరమైన ఆధారాలను ఇప్పటికే సేకరించారు. పర్యావరణ ఉల్లంఘనలతో పాటు అనేక చట్టపరమైన అవకత వకలతో ఉన్న రాజధాని శంకుస్థాపనకు హాజరు కావద్దంటూ ప్రధానమంత్రిపై ఒత్తిడి ప్రారంభమై ంది. పలువరు పర్యావరణ వేత్తలతో పాటు, మేథావులు, నిపుణులు ఈ దిశలో ప్రధాని కార్యాల యానికి లేఖలు రాస్తున్నారు. ఎన్‌జిటి ఆదేశాలిచ్చిన రోజే పర్యావరణ అనుమతులు వచ్చేశాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ప్రచారం ఉత్తదేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.