కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమండిలో పేదల భూముల కోసం పోరాటం చేస్తున్న సీపీఎం నాయకులతో పాటు రైతులను అరెస్టు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘుతో పాటు 60 మంది నేతలను అదుపులోకి తీసుకుని నాగాయలంక పీఎస్ కు తరలించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
District News
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో దీక్షా స్థలికి వచ్చిన పోలీసులు 4.11 గంటలకు వైఎస్ జగన్తో తొలుత మంతనాలు జరిపే ప్రయత్నం చేసి వెంటనే దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను దీక్షా స్థలినుంచి ఎత్తుకెళ్లారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, శాంతియుతంగానే తాను దీక్ష చేస్తున్నాను తప్ప ఎవరికీ ఎలాంటి హానీ చేయడం లేదని చెప్పినా పోలీసులు ఆయన మాట వినలేదు. మరోపక్క, పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడే ఉన్న పార్టీ ముఖ్యనాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, సామాన్య ప్రజానీకం పోలీసులను అడ్డుకునే...
ఇంట్లో పోలీస్ కవాతు బయట డిజిటల్ డాబుసరి.. ఇదీ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తిష్ట వేసిన తాజా దృశ్యం. విశ్వనగరంగా అమరావతిని అభివర్ణిస్తూ ప్రచారం లంకించుకున్న ముఖ్యమంత్రి, శంకుస్థాపన అదరగొడతామని హోరెత్తిస్తున్నారు. కాగా ఈ అట్టహాసాల మాటున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జనం ఆందోళనలను తొక్కేసేందుకు అన్ని రకాల కుయుక్తులకు పాల్పడుతున్నారు. శంకుస్థాపన దగ్గర పడే కొద్దీ రాజధాని గ్రామాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పౌరుల కదలికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించి అణచిపెట్టాలని తాపత్రయ పడటం ప్రజాస్వామ్యానికి విఘాతం. గత చంద్రబాబు జమానాలో జార్జిబుష్, ఉల్ఫెన్ సన్, టోనీ బ్లేయర్ పర్యటనల సందర్భంగా ప్రయోగించిన నిర్భందం ప్రజలింకా మర్చిపోలేదు. అమరావతి...
కిడ్నాప్ చేసిన ముగ్గురు గిరిజన నాయకుల విడుదలకు మావోయిస్టులు విధించిన గడువు మరో 36 గంటల్లో ముగియనున్నా.. ఇంతవరకూ ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రయత్నాలూ ప్రారంభం కాలేదు. దీంతో కిడ్నా్‌పకు గురైన వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. సోమవారం విశాఖ పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పందిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బాక్సైట్ తవ్వకాల అంశంపై ప్రభుత్వ వైఖరిని 13వ తేదీలోగా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేయగా, ఈ విషయం ఇంతవరకు తమకు తెలియదని జిల్లా అధికారులు చెప్పడం గమనార్హం. మన్యంలో బాక్సైట్ తవ్వకాలు జరపబోమని ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు...
రాష్ట్రంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. ఒంగోలులో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగపూర్‌పై ఉన్న యావ ప్రజల సమస్యలపై లేదన్నారు. రాజధాని శంకుస్థాపన ఆర్భాటానికి కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిం చడం అవసరమా అని ప్రశ్నిం చారు. శంకుస్థాపనకే రూ.400 కోట్లు, అతిథి మర్యాదలకు రూ.2.5కోట్లు, వేదికపై యాంకర్లకు రూ.10 కోట్లు కేటాయించారన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో.. ఈ ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు.
పర్యావరణ అనుమతులకు ఆమోదం లభించకుండా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో ఎలాంటి పనులూ(నేల చదును, నిర్మాణాలు చేపట్టడం) చేయకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జిటి) ఆదేశాలిచ్చింది. అలాగే నూతన రాజధాని ప్రాంతంలోని చిత్తడి నేలలు, ముంపు ప్రాంతాల గుర్తింపుపై పూర్తి నివేదికను తమకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపాదిత రాజధాని నిర్మాణ స్థలంలోని ముంపు ప్రాంతాలకు సరిహద్దులు నిర్ణయించాలని సూచించిన ట్రిబ్యునల్... అందులో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన నిరవధిక దీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవల్స్, పల్స్ రేటు పడిపోవడంతోపాటు బరువు తగ్గుతున్నట్లు వైద్యులు నిర్ధారించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. దీక్షా శిబిరానికి వచ్చిన జగన్ సతీమణి వైఎస్ భారతి జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
నల్లపాడులో నిరవధిక దీక్ష చేపట్టిన వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్షకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలియజేసారు .. ఈసందర్భంగా ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. చంద్రబాబు.. రోజు వారి ఉపన్యాసాలు వింటుంటే నిజాయితీ నశించిందని అనిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదా కాదు...ప్యాకేజీలున్నాయని ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. కనీస నిజాయితీ లేదని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో నిజాయితీ లేదని విమర్శించారు. పీఆర్సీ 2013 అమలు జరగాల్సి ఉంటే 2014 నుండి అమలు చేస్తామని తెలిపారు. హెల్త్ కార్డులు..అంగన్ వాడీలు..మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలు అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. 43 శాతం ఫిట్ మెంట్ అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు...
విజయవాడలో డెంగ్యు , విషజ్వరాలతో ప్రజలు భాధ పడుతున్నా పాలకవర్గానికి చీమకుట్టినట్లయినా లేదని సిపిఎం విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఘాటుగా విమర్శించారు.సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ కార్పోరేషన్ కార్యాలయం వద్ద ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
జిల్లాకు ప్రాణవాయువు లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికా కపోవడంతో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు అది ఒక వరం లాగా మారింది. ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షలాది ఎకరాలు పంట భూములుగా సాగులోకి తీసుకురావచ్చునని ప్రకటిస్తున్నారు. కానీ ఇది ఆచరణలో ఎంత సాధ్యమో గత దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పార్టీలు చేసిన ప్రకటనలు, వాగ్దానాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమౌతుంది. నాటి ముఖ్యమంత్రి అంజయ్య మొదలుకుని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మనం పరిశీలన చేస్తే వాళ్ళకు రాజకీయంగా...