వైఎస్ జగన్ దీక్ష భగ్నం..

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో దీక్షా స్థలికి వచ్చిన పోలీసులు 4.11 గంటలకు వైఎస్ జగన్తో తొలుత మంతనాలు జరిపే ప్రయత్నం చేసి వెంటనే దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను దీక్షా స్థలినుంచి ఎత్తుకెళ్లారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, శాంతియుతంగానే తాను దీక్ష చేస్తున్నాను తప్ప ఎవరికీ ఎలాంటి హానీ చేయడం లేదని చెప్పినా పోలీసులు ఆయన మాట వినలేదు. మరోపక్క, పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడే ఉన్న పార్టీ ముఖ్యనాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, సామాన్య ప్రజానీకం పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిపై లాఠీ చార్జి జరిపి మరి పోలీసులు వైఎస్ జగన్ ను 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు.