శంకుస్థాపనకి రూ400 కోట్లా?:మధు

 నల్లపాడులో నిరవధిక దీక్ష చేపట్టిన వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్షకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలియజేసారు .. ఈసందర్భంగా ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. చంద్రబాబు.. రోజు వారి ఉపన్యాసాలు వింటుంటే నిజాయితీ నశించిందని అనిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదా కాదు...ప్యాకేజీలున్నాయని ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. కనీస నిజాయితీ లేదని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో నిజాయితీ లేదని విమర్శించారు. పీఆర్సీ 2013 అమలు జరగాల్సి ఉంటే 2014 నుండి అమలు చేస్తామని తెలిపారు. హెల్త్ కార్డులు..అంగన్ వాడీలు..మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలు అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. 43 శాతం ఫిట్ మెంట్ అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని, చంద్రబాబు ను ఎలా నమ్మేది అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ జరుగుతుందని రైతులు ఆశించారని, కానీ ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. సగం బ్యాంకులు రైతులకు అప్పులివ్వలేదని తెలిపారు.రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఈవెంట్ మేనేజ్ మెంట్ కు పది కోట్లు..అతిథిల కోసం రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. ఎవడమ్మ మొగుడు సొత్తు అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.