ప్రభుత్వ నిర్ణయాలు కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా ఉంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో లే అవుట్లు, ఇళ్ల నిర్మాణాల అనుమతులకు సిఆర్‌డిఎ విధిస్తున్న నిబంధనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సిఆర్‌డిఎ పరిధిలోని 58 మండలాల్లో అగ్రికల్చర్ ప్రొటక్షన్ జోన్ (గ్రీన్‌బెల్ట్)ను ఏర్పాటు చేసి ప్రస్తుతం గ్రామంలో ఇళ్లున్న ప్రాంతానికి 500 మీటర్లలోపు దూరంలోని లే అవుట్లకు మాత్రమే అనుమతి ఇస్తామని సిఆర్‌డిఎ చెబుతోంది. దీంతో గ్రీన్‌బెల్ట్ ప్రాంతంలో రైతుల పొలాలకు విలువ తగ్గిపోతోంది. అలాగే పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి సంపాధించుకుని అంతో ఇంతో తక్కువ ధరకు వచ్చే గ్రామానికి దూరంగా ఉండే స్థలాలను కొనుగోలు...
District News
భోగాపురంలో టిడిపి చేస్తున్న బలప్రయోగాన్ని అందరూ ఖండించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారని, జనాలను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే లాఠీచార్జ్ చేసి చావగొడుతున్నారన్నారు. పెద్ద ఎత్తున్న బలగాలను దించి రైతులను భయబ్రాంతులను గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. లక్షలాది ఎకరాలు తీసుకుంటే తీరని అన్యాయం జరుగుతుందని, దీనిని ఖండించాలని మధు పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలపై ప్రభుత్వ విధానాల కారణంగా ఏర్పడు తున్న సమస్యలపై ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. నర్సింగరావు పిలుపు నిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని సిఐటియు కార్యాల యంలో ఆదివారం పబ్లిక్ సెక్టర్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యాన ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న నష్టాలను ఎలా ప్రతి ఘటించాలన్న అంశంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు లేమి, ప్రయివేటీకరణ ముప్పు వంటి కారణాల వల్ల భవిష్యత్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. హిందుస్థాన్ షిప్‌యార్డు, హెచ్‌పిసిఎల్‌లో వాటాల విక్రయం ద్వారా ప్రయివేటు వారికి ప్రభుత్వం కట్టబెడుతుందని వివరించారు. విశాఖ పోర్టు ప్రయివేటీకరణలో...
కేంద్రం సవరించిన చట్టాలు అమల్లోకి వస్తే కార్మికులు బానిసత్వంలో కూరుకుపోతారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్‌లో ఆదివారం నిర్వహించిన సిఐటియు జిల్లా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులనుప్రభుత్వాలు కాలరాస్తు న్నాయని విమర్శించారు. కేంద్రం 5 కార్మిక చట్టాలు చేసింద న్నారు. సమ్మెలు నిషేధించడం, యాజమాన్యానికి అనుకూ లంగా పనిచేయడం, యూని యన్లు పెట్టకుండా నిరోధి ంచడం వంటివి అందులో ప్రధానమైనవని అన్నారు. కార్పొరేట్ శక్తులు, విదేశీ పెట్టుబడిదారుల షరతులకు లోబడి ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయన్నారు. కార్మికులంతా సంఘటితమై...
విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 నుండి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను చేపడుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పేదల భూములు లాక్కొని కార్పొరేట్, బహుళజాతి కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూస్తే ఆందోళనలు తప్పవని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు హెచ్చరించారు. శుక్రవారం పాతబస్టాండ్‌లోని సిపిఎం కార్యాలయంలో 'భూ బ్యాంక్ బండారం-కార్పోరేట్లకు పందేరం' అనే పుస్తకాన్ని ఆవిష్క రించారు.
అమరావతి శంకుస్థాపనలోపే రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రస్తుతం భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్న రైతులకు అండగా ఉండేందుకు ఆ పార్టీ రాజధాని ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్ర ద్వారా 120 కిలోమీటర్లు 29 గ్రామాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకూ పోరాటం చేస్తామని రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ సీపీఎం కన్వీనర్ బాబురావు పేర్కొన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, అందుకు గ్రంథాలయోద్యమం మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద పిలుపునిచ్చారు. విజయవాడ ఆకుల వారి వీధిలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహాకవి గురజాడ పఠన మందిరాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎంతటి సమాచారం ఉన్నా అది గ్రంథాలయాల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వస్తుం దన్నారు. మహాత్మాగాంధీ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు గొప్ప నాయకులంతా గ్రంథాలయాల్లోనే ఎక్కువ సమయం గడిపారన్నారు. చిన్నతనం నుంచి తమకు నచ్చిన పుస్తకాలను చదవనిస్తే, పిల్లలకు పుస్తక పఠనం అల వాటుగా మారుతుందని చెప్పారు. పాఠకుల సంఖ్య ఎప్పటికప్పుడు...
మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గడియారస్తంభం సెంటర్లో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు సిహెచ్.రమణి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యానికి పోరాడాలన్నారు. మద్యం వల్ల హింస పెరిగిపోతోందని, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని అన్నారు. మద్యపానం నిషేధించే వరకూ వివిధ రూపాల్లో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి పంపిస్తామన్నారు
విమానాశ్రయ ప్రభావిత గ్రామాల్లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వే (రైట్స్) (న్యూఢిల్లీ) బృందం చేపట్టిన సర్వేను బాధితులు అడ్డుకున్నారు. సర్వే రాళ్లను మహిళలు పీకేశారు. గురువారం పలు గ్రామాల్లో సర్వే చేసి బౌండరీలు ఏర్పాటు చేసిన రైట్స్ బృందం సభ్యులు శుక్రవారం కొంగవానిపాలెం, దిబ్బలపాలెం ప్రాంతాల్లో పలు చోట్ల రాళ్లు పాతారు. తూడెం గ్రామంలో జిరాయితీ భూముల్లో సర్వే రాళ్లు ఏర్పాటు చేయడంతో రైతులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అడిగేందుకు వెళ్లిన వారిని పోలీసులు వెళ్లగొట్టారు. అనంతరం గ్రామ పెద్దలతో అందరూ కలిసి వెళ్లి సర్వే రాళ్లను భూముల నుంచి తొలగించారు. అక్కడి నుంచి బసవపాలెం మీదుగా...