ప్రభుత్వ ఒప్పందం ప్రకారం మున్సిపల్ ఉద్యోగులకు అందజేస్తామని హామీ ఇచ్చిన రూ. 11 వేల జీతాలకు జీవోను వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ గఫూర్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన 11 రోజుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం విజయ వాడలో శుక్రవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని ప్రారంభి ంచిన గఫూర్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ అని పదే పదే చెప్పే చంద్ర బాబు వీధులను, డ్రైనేజీలను శుభ్రపరిచే వారికి పెంచిన వేతనాలు అందించకపో వడం సిగ్గు చేటన్నారు. ఇంజనీరింగ్, ఆఫీసు స్టాఫ్ స్కిల్డ్, సెమి స్కిల్డ్ ఉద్యోగులకు జీతా లు...
District News
రాజధాని నిర్మాణ విషయంలో రహస్య ఒప్పందాలవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సిపిఎం సిఆర్‌డిఏ ఏరియా కన్వీనర్ సిహెచ్.బాబూరావు విమర్శించారు. రాజధాని విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అనుమానాలకు ఊతమిస్తున్నాయన్నారు. దీనిపై స్పష్టత కరువైందని తెలిపారు. పరోక్ష పద్ధతిలో భూములను విదేశీ కంపెనీలకు కట్ట బెట్టాలనే కుట్ర సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు. మాస్టర్ డెవలపర్ ఎంపిక అనంతరం నిర్మాణ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పిన ప్రభుత్వం నేరుగా సింగపూర్ ప్రభుత్వంతో ఎలా చర్చలు జరుపుతుందని ప్రశ్నించారు. మూడు వేల ఎకరాలను భాగస్వామ్య పద్ధతిలో...
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. తుళ్లూరును రాజధాని ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం పలు హామీలిచ్చింది. అయితే అమలులో మాత్రం చతికిలపడింది. భూములిచ్చిన రైతులకు పరిహారం ప్యాకేజి కింద అభివృద్ధి చేసిన భూములను ఎక్కడ కేటాయిస్తారనేది ఇప్పటికీ స్పష్టతివ్వలేదు. భూమిలేని నిరుపేదలకు పింఛను ఇస్తామన్నారు. 23,500 మంది నిరుపేదలున్నట్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం తరువాత వివిధ రూపాల్లో వడపోత చేపట్టి గురువారం వరకూ 13,019 మందికి ఫించన్లు అందించింది. ఇంకా దాదాపు నాలుగు వేల వరకూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు...
ప్రయివేటు రంగంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక యుటిఎఫ్ భవనంలో జిల్లా అధ్యక్షులు దిగుపాటి రాజగోపాల్ అధ్యక్షతన కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సమస్యలపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో దళితులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపట్టడం లేదన్నారు. గత 30 సంవత్సరాలుగా రిజర్వేషన్లు దళితులకు అందని ద్రాక్షగా ఉన్నాయన్నారు. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలు అమలవుతున్న నేపథ్యంలో దళితులకు నష్టం జరుగుతుందని ఆవేదన...
పెంచిన జీతాలు, ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల మున్సిపల్ కార్మి కులు ధర్నాలు నిర్వహించారు. విశాఖలో జివిఎంసి కార్యా లయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.11వేలు అమలు చేయాలని, ప్రతి నెలా 5వ తేదీకే వేతనాలు చెల్లించాలని, గుర్తింపు యూనియన్ 41 ప్యాకేజీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి అంజిబాబు మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా 16 రోజుల సమ్మె కాలాన్ని సెలవు దినంగా...
విశాఖ జిల్లాలోని పలు ప్రయివేటు పరిశ్రమల్లో ప్రమాదాల పరంపర కొనసాగుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. నర్సింగరావు విమర్శించారు. తెలుగుదేశం పాలన పూర్తిగా కార్మిక హేళనకు మచ్చుతునకగా ఉందని అన్నారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 28న గంగవరం పోర్టులోనూ, పరవాడ ఫార్మాసిటీ సాయినార్ కంపెనీల్లోనూ ప్రమాదాలు జరిగి ముగ్గురు కార్మికులు మరణించారని తెలిపారు. ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోగా విప్‌ల సదస్సులో పాల్గొనడానికి విశాఖ విచ్చేసిన చంద్రబాబు కార్మిక పోరాటాలను అణచివేస్తామని చెప్పడం ద్వారా కార్పొరేట్ కంపెనీలకు భరోసా ఇవ్వడానికే ఇక్కడికి వచ్చారా? అని ఆయన ప్రశ్నించారు....
రాయలసీమ అభివృద్ధికి రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో చేపట్టిన సిపిఎం జీపుజాతా బుధవారం నంద్యాల, గాజులపల్లె, మహానంది, వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో బిజెపి అగ్రనాయకులు వెంకయ్యనాయుడు ఎపికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా గురించి పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీటిమట్టం చేరుకున్న...
భారతదేశంలో ఉన్నది పాసిస్టు ప్రభుత్వం కాకపోయినా పాసిస్టు పోకడలు కనిపిస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రిస్తోందని అభిప్రాయపడ్డారు. ఆలిండియా విప్స్ సదస్సులో పాల్గొనటానికి విశాఖ వచ్చిన బేబీ బుధవారం సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ నేతలు అగ్రవర్ణాల సహకారంతో బడుగు, బలహీన వర్గాలను అణచివేయాలని చూస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లు తీసేయాలని ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటన చేయడం అందులో...
ప్రభుత్వం చేనేత పార్కులను ఏర్పాటు చేసి చేనేత కార్మి కులకు ఉపాధి కల్పించాలని ఎపి చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ పి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎపి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేత కార్మికులు ధర్నా చేశారు. కర్నూలు జిల్లా కార్యదర్శి జెఎన్ శేషయ్య అధ్యక్షత జరిగిన ధర్నాలో జమలయ్యతోపాటు, కార్మికుల ఆందోళనకు మద్దతు పలుకు తూ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్ కూడా మాట్లా డారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. జిల్లాలో 15 వేలకు మందికిపైగా చేనేత వృత్తిపై ఆధారపడ్డారని తెలిపారు. వీవర్స్ క్రెడిట్ కార్డ్సు పథ కం ద్వారా 2013-14లో వంద మందికి, 2014-15లో 900 మంది...