వేతనాలG.Oవిడుదల చేయాలి:గఫూర్

ప్రభుత్వ ఒప్పందం ప్రకారం మున్సిపల్‌ ఉద్యోగులకు అందజేస్తామని హామీ ఇచ్చిన రూ. 11 వేల జీతాలకు జీవోను వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ గఫూర్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన 11 రోజుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం విజయ వాడలో శుక్రవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని ప్రారంభి ంచిన గఫూర్‌ మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ అని పదే పదే చెప్పే చంద్ర బాబు వీధులను, డ్రైనేజీలను శుభ్రపరిచే వారికి పెంచిన వేతనాలు అందించకపో వడం సిగ్గు చేటన్నారు. ఇంజనీరింగ్‌, ఆఫీసు స్టాఫ్‌ స్కిల్డ్‌, సెమి స్కిల్డ్‌ ఉద్యోగులకు జీతా లు చెల్లించాలన్నారు. ప్రభుత్వం తలచుకుంటే జీవో విడుదల చేయడానికి ఎంత కాలం పడుతుందని ఆయన ప్రశ్నించారు. గాంధీ జయంతి రోజు తాము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, పెంచిన వేతనాల జీవో విడుదల చేయక పోతే సిఎం ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా చీపుర్లతో అక్కడికి వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పెట్టుబడిదారు లకైతే 21 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోందన్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె ముగిసి 2 నెలలు గడిచినా జీఒ ఇవ్వకుండా కార్మికుల పట్ల వివక్ష చూపడాన్ని నిరసిస్తున్నామ న్నారు. ప్రభుత్వ విధానం వల్ల గాంధీ జయంతి నాడు దీక్ష చేయాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం స్మార్ట్‌, అమృత్‌, సిటీల పథకాల పేరుతో మున్సిపాలిటీలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.ప్రభుత్వ ఒప్పందం ప్రకారం మున్సిపల్‌ ఉద్యోగులకు అందజేస్తామని హామీ ఇచ్చిన రూ. 11 వేల జీతాలకు జీవోను వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ గఫూర్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన 11 రోజుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం విజయ వాడలో శుక్రవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని ప్రారంభి ంచిన గఫూర్‌ మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ అని పదే పదే చెప్పే చంద్ర బాబు వీధులను, డ్రైనేజీలను శుభ్రపరిచే వారికి పెంచిన వేతనాలు అందించకపో వడం సిగ్గు చేటన్నారు. ఇంజనీరింగ్‌, ఆఫీసు స్టాఫ్‌ స్కిల్డ్‌, సెమి స్కిల్డ్‌ ఉద్యోగులకు జీతా లు చెల్లించాలన్నారు. ప్రభుత్వం తలచుకుంటే జీవో విడుదల చేయడానికి ఎంత కాలం పడుతుందని ఆయన ప్రశ్నించారు. గాంధీ జయంతి రోజు తాము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, పెంచిన వేతనాల జీవో విడుదల చేయక పోతే సిఎం ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా చీపుర్లతో అక్కడికి వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పెట్టుబడిదారు లకైతే 21 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోందన్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె ముగిసి 2 నెలలు గడిచినా జీఒ ఇవ్వకుండా కార్మికుల పట్ల వివక్ష చూపడాన్ని నిరసిస్తున్నామ న్నారు. ప్రభుత్వ విధానం వల్ల గాంధీ జయంతి నాడు దీక్ష చేయాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం స్మార్ట్‌, అమృత్‌, సిటీల పథకాల పేరుతో మున్సిపాలిటీలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.