
ప్రభుత్వం చేనేత పార్కులను ఏర్పాటు చేసి చేనేత కార్మి కులకు ఉపాధి కల్పించాలని ఎపి చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ పి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎపి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేత కార్మికులు ధర్నా చేశారు. కర్నూలు జిల్లా కార్యదర్శి జెఎన్ శేషయ్య అధ్యక్షత జరిగిన ధర్నాలో జమలయ్యతోపాటు, కార్మికుల ఆందోళనకు మద్దతు పలుకు తూ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్ కూడా మాట్లా డారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. జిల్లాలో 15 వేలకు మందికిపైగా చేనేత వృత్తిపై ఆధారపడ్డారని తెలిపారు. వీవర్స్ క్రెడిట్ కార్డ్సు పథ కం ద్వారా 2013-14లో వంద మందికి, 2014-15లో 900 మంది కార్మికులకు మాత్రమే బ్యాంకు రుణాలను మంజురు చేశారని తెలిపారు. ఇంకా 300కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా చేనేత కార్మికులకు రుణమాఫీ చేసి కొత్తగా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.