
కేంద్రం సవరించిన చట్టాలు అమల్లోకి వస్తే కార్మికులు బానిసత్వంలో కూరుకుపోతారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్‌లో ఆదివారం నిర్వహించిన సిఐటియు జిల్లా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులనుప్రభుత్వాలు కాలరాస్తు న్నాయని విమర్శించారు. కేంద్రం 5 కార్మిక చట్టాలు చేసింద న్నారు. సమ్మెలు నిషేధించడం, యాజమాన్యానికి అనుకూ లంగా పనిచేయడం, యూని యన్లు పెట్టకుండా నిరోధి ంచడం వంటివి అందులో ప్రధానమైనవని అన్నారు. కార్పొరేట్ శక్తులు, విదేశీ పెట్టుబడిదారుల షరతులకు లోబడి ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయన్నారు. కార్మికులంతా సంఘటితమై హక్కులను సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం మోహన్‌రావు, కె అజరుకుమార్ పాల్గొన్నారు.