ఐక్య పోరాటాలే శరణ్యం:గఫూర్

కార్మికుల మెడలపై కత్తి వేసే విధంగా ఉన్న ప్రభుత్వ విధానాలను తిప్పకొట్టడానికి ఐక్య పోరాటాలే శరణ్యమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు. బుధవారం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గుహల ఆవరణంలో నిర్వహించిన సిఐటియు రాష్ట్ర స్థాయి క్లస్టర్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను సవరిస్తూ, ప్రయివేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. గత కార్మిక చట్టాల్లో ఎనిమిది గంటల పని దినాలు ఉన్నా, వాటిని ప్రయివేటు యాజమాన్యాల లాభాల కోసం బిజెపి సవరించి తీరుతామని చెప్పడం విడ్డూరమన్నారు.