కార్పొరేట్ల కోసమే భూబ్యాంకు: వెంకటేశ్వర్లు

బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ల కోసమే ప్రభుత్వం భూ బ్యాంకు పేరిట భూములను బలవంతంగా సేకరిస్తోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అన్నారు. కడప జిల్లా బద్వేలు నియోజక వర్గంలో భూబ్యాంక్‌ కింద 36 వేల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూముల్ని తీసుకున్న గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఒక్క కడప జిల్లాలోనే భూ బ్యాంకు కోసం 1.23 లక్షల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందన్నారు. ఈ విధానాన్ని రైతులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేటర్లకు చౌకగా కట్టబెట్టేందుకే జిల్లాలో 33 మండలాల్లో పేదలు, రైతులకు చెందిన భూముల్ని సేకరిస్తోందని విమర్శించారు.