
రైతులు, పేదలు సాగు చేసుకుంటున్న భూములను గుంజుకొని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రభుత్వ భూ బ్యాంకు విధానాన్ని ఉప సంహరించుకోవాలని భూ హక్కుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది.ఈసదస్సులో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ధిక్కరించిందని విమర్శించారు. కర్నూలు జిల్లా శకునాల గ్రామంలో రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండానే వారి భూములను లాక్కుందని విమర్శించారు. బందర్ పోర్టు భూ సేకరణకు ఎదురు తిరిగిన 29 మంది రైతులపై పోలీసులు నాన్‌బెయిల్ సెక్ష న్లతో కేసులు పెట్టారన్నారు. అవసరానికి మించిన భూములను జోలికెళ్లొద్దని, పారిశ్రామిక అభివృద్ధికి ఎంత భూమి కావాలో అంతా తీసుకోవాలని సూచించారు.