అమరావతి రోడ్డుపై రాస్తారోకో..

అర్హులైనవారందరికీ ప్రభుత్వం ప్రకటించిన భూమిలేని నిరుపేదలకు ఇస్తానన్న రూ.2500లు పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ శుక్రవారం నిడమర్రులోని సిఆర్‌డిఎ కార్యాలయాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు పెద్దఎత్తున ముట్టడించారు. వందలాదిమంది కార్యాలయం ఆవరణలోకి జొరబడి పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అర్హులను కాదని అనర్హులకు పింఛన్లు కట్టబెడుతున్నారని బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. జన్మభూమి కమిటీ పేరుతో పచ్చచొక్కాల కార్యకర్తల ప్రమేయం పెరగడం వలనే అనర్హులకు అందలాలు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.