CRDA కార్యాలయం ముట్టడి..

రాజధానిలో పింఛన్ల జాబితాలో అవకతవకలున్నాయనే ఆగ్రహంతో పేదలు తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో మంగళవారం ధర్నాలు నిర్వహించారు. తాడేపల్లి మండలం పెనుమాక పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం బైఠాయించారు. పచ్చచొక్కలోళ్ళకే పింఛన్లు దక్కుతున్నాయని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, జె.నవీన్‌ప్రకాష్‌ అక్కడికి చేరుకున్నారు. అవకతవకలను సరిచేయాలని సర్పంచ్‌ కళ్ళం పానకాలరెడ్డిని కోరారు. అనంతరం ఎస్‌ఐ వినోద్‌కుమార్‌, కార్యదర్శి పద్మావతి ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. మరోపక్క తుళ్లూరు మండలం అనంతవరంలో 200 మంది పేదలు క్రిడా కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామంలో గత నెల్లో పింఛన్లు ఇచ్చి ఈ నెల్లో ఆపేశారని మండిపడ్డారు. విచారణ పేరుతో ఫిరంగిపురం ఎంపిడిఒ శ్యామలాదేవి సరిగ్గా పరిశీలించకుండా టిడిపి నాయకుల కనుసన్నల్లో తుది జాబితాను రూపొందించారని పేదలు చెపుతున్నారు.