ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కర్నూలులో సీపీఎం రీలే నిరహార దీక్షలు చేపట్టింది. రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని సీపీఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు ఎంఏ గఫూర్ విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే ఈనెల 15న అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపడుతామని ఆయన హెచ్చరించారు. రాయలసీమలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని, లక్షలాది మంది వలసలు వెళ్లారన్నారు. రాయలసీమ ప్రాంతం యొక్క సమస్యలను పరిష్కరించడానికి లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని గఫూర్ డిమాండ్ చేశారు.