కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణల్లో సామాజిక న్యాయం లేకపోవడంతో ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు, ఉన్న ఉద్యోగాలకు భద్రత సన్నగిల్లుతున్నాయని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారావు పిలుపునిచ్చారు. శ్రీశ్రీ భవన్‌లో బుధవారం కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఈనెల 28న గుర్రం జాషువా జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని...
District News
పారిశ్రామిక అభివృద్ధికే భూసమీకరణ అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు పేర్కొన్నారు. మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టును అడ్డం పెట్టుకుని పరిశ్రమల పేరుతో పెద్దఎత్తున భూములు లాక్కొంటోందన్నారు. అక్కడ వేలాది ఎకరాలను దశాబ్దాల తరబడి స్థానికులు సాగు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ భూదందాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. టిడిపి, కారగ్రెస్ నేతలపై జరిగిన తిరుగుబాటే దీనిని నిదర్శనమన్నారు. ప్రభుత్వం బేషరతుగా భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం...
అధికార పార్టీ నాయకులు, మట్టిమాఫియా, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై రామేశంపేట మెట్ట భూమిలో మట్టిని కొల్లగొట్టుకుపోతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తంచేశారు. రామేశంపేట మెట్ట భూముల దళిత రైతులు సిపిఎం ఆధ్వర్యాన పెద్దాపురం తహశీల్దార్, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దడాల మాట్లాడుతూ దళితులకు ఉపాధి నిమిత్తం ఇచ్చిన అసైన్డ్ భూములను 9/77 యాక్టు ప్రకారం అమ్మకాలుగానీ, కొనుగోళ్లు గానీ చేయకూడదన్నారు. జిఒ 2/2013ను చూపించి చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. రామేశంపేట మెట్టచుట్టూ నోట్లకట్టల రాజకీయం నడుస్తోందన్నారు.
పెండింగ్ వేతనాలు, పారితోషకాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆశావర్కర్లు తూర్పుగోదావరి జిల్లా చింతూరు రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు భారీ ర్యాలీ చేశారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణమూర్తి మాట్లాడారు. ఎంఎల్‌ఎ, ఎంపీల ఇంటి అద్దె అలవెన్సు పెంచుతున్న ప్రభుత్వం తక్కువ వేతనంతో కాలం వెళ్లదీస్తున్న ఆశాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ముంపు మండలాల కార్మికుల సంక్షేమం పై శద్ధ చూపడంలేదన్నారు. తహశీల్దార్ శివకుమార్ ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు. అడిషనల్ డిఎంహెచ్‌ఓతో ఫోన్లో మాట్లాడారు.
విశాఖ కలెక్టరేట్ వద్ద సమస్యలపై శాంతియుతంగా మంగళవారం ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనలు నిర్వహిం చారు. పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా ఎప్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యాన విశాఖ జిల్లా పాడేరులో విద్యార్థులు ఐటిడిఏ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ ఆందోళన నిర్వహించారు. ప్రదర్శనకు అనుమతి లేదంటూ ఎస్‌ఐ సూర్యప్రకాశరావు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అప్పారావును అరెస్టు చేశారు. అరకువేలీ, నర్సీపట్నంలో విద్యార్థులు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. అచ్యుతా పురంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ధర్నా, రాస్తారోకో జరిగాయి. ఎస్‌ఎఫ్‌ఐ విజయవాడ నగర...
సిపియం ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో నిర్భంధం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టెబుల్ సమావేశంలో సిపియం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధాని అని చెబుతున్న ప్రభుత్వం శంఖుస్థాపన జరగక ముందే అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తుందన్నారు. ఇది రాజధాని సమస్య కాదని పౌర హక్కుల సమస్యని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి 1.10 లక్షల ఎకరాల భూమిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందనీ, కానీ మాస్టర్ ప్లాన్ లో మాత్రం అన్ని కార్యాలయాలకు కలిపి 155 ఎకరాలు సరిపోతుందని చూపిస్తున్నారని, మిగిలిన భుమూల్ని కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ కూలిలకు ఉపాధి, పింఛన్లు ఇంత వరుకు ఇవ్వలేదని, రైతులకు భూమి...
భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఒక్క ఎకరా కూడా గుంజుకో నివ్వబోమని, అడ్డగోలు భూ సేకరణను కలిసికట్టుగా అడ్డుకుందామని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. బలవంతపు భూ సేకరణపై రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పేదోళ్ల భూములే దొరికాయా అని చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి పేరుతో 13జిల్లాల్లోనూ చంద్రబాబు 15లక్షల ఎకరాలు భూసేకరణ చేపడుతున్నాడని, దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు అవేదన చెందుతున్నారని తెలిపారు. అవసరాలకు మించి భూములు గుంజుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి ఉద్యమం జరగబోతుందని, దీనికి అందరూ సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు....
144 సెక్షన్ పేరుతో రాజధాని ప్రాంతంలో పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపుతున్న ప్రభుత్వ పోకడను సిపిఎం రాజధాని డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం మంగళగిరిలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఎంఆర్‌పిఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం అప్రజాస్వామికమని సిపిఎం రాజధాని డివిజన్ కమిటీ కార్యదర్శి ఎం.రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్‌పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణను, కోస్తా జిల్లాల కన్వీనర్ మల్లవరపు నాగయ్య తదితర నాయకులను పోలీస్ స్టేషన్‌లో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాజధానిలో దళితులు, పేదలు హక్కుల గురించి మాట్లాడుతుంటే చట్టాల పేరుతో పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు....
అభివృద్ధికి పేదల గుడిసెలు అడ్డంకి కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు అన్నారు. భవానీపురం కరకట్ట సౌత్ ప్రాంతమైన భవానీఘాట్ నుండి పున్నమి హాోటల్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ కరకట్ట వాసులు వారం రోజుల్లోగా ఇళ్లను ఖాళీచేసి జెఎన్‌యుఆర్‌ఎం ఇళ్లకు తరలివెళ్లాలని నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీచేయటం సిగ్గుచేటన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా నగరానికి దగ్గరగా వుండి ఏదోఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారిని ఏక్కడో దూరంగా పడేస్తే వారి జీవన భృతి కష్టతరంగా మారుతుందన్నారు. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా...