సింగపూర్‌ షరతులు..!

రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీలకే అప్పగించాలంటే అందుకు ప్రతిగా అవి వాటికోసం కోరుకున్న భూములనూ సర్వ హక్కులతోనూ ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. కంపెనీల షరతులు:తమకు కేటాయించే భూములపై పూర్తి హక్కులూ తమకే అప్పగించాలని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేవని రాజధాని నిర్మాణం చేపట్టదలచిన కంపెనీలు తెలిపినట్లు తెలిసింది. 99 సంవత్సరాల లీజు పద్ధతిలో ఇచ్చినా భూమిపై హక్కులు తమకే ఉండాలని, అందుకు అవసరమైన డాక్యుమెంట్లున్నీ అప్పగించాలని సింగపూర్‌ ప్రతినిధులు షరతు పెట్టినట్లు సమాచారం. రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వడానికి వీలులేని పద్ధతిలో అగ్రిమెంట్లు చేయించుకుంటున్న ప్రభుత్వం వాటినే కంపెనీలకు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. న్యాయపరమైన చిక్కులొస్తే తమకు ఇబ్బంది అవుతుందని, అలాంటివేమీ లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కూడా ఆయా కంపెనీలు కోరినట్లు తెలిసింది.ఇందుకు ప్రభుత్వ పెద్దలు అంగీకారించారని తెలిసింది.