ప్రత్యేక హోదాకై జరిగే బంద్‌లో వామపక్షపార్టీ నాయకుల‌ అరెస్టుకు సిపియం ఖండన.

రాష్ట్ర విభజన సందర్భంగా బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయల‌సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల‌కు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకేంద్రంగా రైల్వేజోన్‌ వంటివి అనేక వాగ్ధానాలు ఇచ్చింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బిజెపి మాటతప్పింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి ప్రభుత్వం చెపుతుంటే కేంద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై అఖిల‌పక్షాల‌ మద్దతు తీసుకొని ఒత్తిడి తేవడంలో విఫల‌మయ్యింది. నేడు ప్రత్యేక హోదాకై వామపక్షపార్టీలు బంద్‌ నిర్వహిస్తే దానికి సహకరించాల్సిన ప్రభుత్వం పోలీస్ బల‌గాల‌ను ఉపయోగించి అక్రమంగా అరెస్టు చేయించడం అత్యంత దుర్మార్గం.  ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండివైఖరి వీడాల‌ని కోరుతున్నాం.
    అలాగే దేశవ్యాపితంగా ఉల్లి, కందిపప్పు ధరలు ఆకాశన్నుంటుతున్నాయి. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి. వీటిని అదుపుచేయడంలో కూడా ఈ ప్రభుత్వాలు విఫమయ్యాయి.