March

ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వాడివేడి చర్చ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్‌ సభ్యులు ఉభయ సభల్లో చేసిన డిమాండ్లతో మంగళవారం పార్లమెంటులో వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా రాజ్యసభలో వాడివేడి చర్చ చోటు చేసుకొంది. విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ సభ్యులంతా ప్రభుత్వ తీరుపై గళమెత్తారు. చర్చలో సి.ఎం.రమేశ్‌ (తెదేపా) పాల్గొంటూ- కాంగ్రెస్‌ పార్టీ హడావుడిగా, అశాస్త్రీయంగా విభజన చట్టాన్ని రూపొందించిందని ఆరోపించారు. తెదేపా మొదటి నుంచీ పోరాడుతున్న అంశంపై ఎట్టకేలకు కాంగ్రెస్‌ నేతల్లో అవగాహన వచ్చిందని చెప్పారు. ప్రత్యేక హోదా కల్పించడంలో పురోగతి ఏమిటో తెలపాల్సిందిగా ఆజాద్‌ నిలదీశారు.

మమతా సర్కార్‌ ఉక్కిరిబిక్కిరి..

బెంగాల్‌లో స్టింగ్‌ ఆపరేషన్‌ మమతా సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీలు లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినట్లు వెల్లడించే ఓ వీడియో పశ్చిమబెంగాల్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. టీఎంసీ ఎంపీలు సౌగత్‌రాయ్‌, అహ్మద్‌ మిజ్రా, బెంగాల్ మంత్రి సుబ్రతముఖర్జీ , కోల్‌కతా మేయర్‌ శోవన్‌ ఛటర్జీ ఓ లాబీకి హామీలిస్తూ లంచాలు తీసుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపించారు. నారదన్యూస్‌.కామ్‌ అనే వెబ్‌ ఛానల్‌ రెండేళ్ల వ్యవధిలో ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ ను నిర్వహించింది.

భూముల రక్షణకు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం

           భూములను రక్షించుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. భూ సేకరణపై ప్రభుత్వం ముందడుగు వేస్తే రైతులకు అండగా నిలిచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఆర్‌టిసి కాంపెక్స్‌ వద్ద సోమవారం భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పిసిపిఐఆర్‌ కోసం ప్రభుత్వం వంద పంచాయతీల్లో లక్షా 30 వేల ఎకరాల భూమిని రైతుల వద్ద బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.

ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం ఫై ఇంజినీరింగ్‌ నిపుణుల బృందంచే విచారణ జరిపించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహనిర్మాణం కింద విశాఖనగరంలో పెందుర్తి ప్రాంతంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం చేపట్టింది. ఈరోజు సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి శ్రీ బి.గంగారావు నాయకత్వంలో  బృందం   పెందుర్తిలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది.  ఈ నిర్మాణా యొక్క భద్రత, ప్రమాణాలు , నాణ్యత, దాని కాలవ్యవధి తదితర అంశాపై అనేక అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి.

రైల్వే జోన్‌ పై ఎంపి కె. హరిబాబు ప్రకటనపై సిపిఐ(ఎం) నిరసన

     విశాఖ నగర ఎంపి కె.హరిబాబుగారు నిన్న రైల్వేజోన్‌పై ప్రకటించిన కుట్రపూరిత ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ రావటానికి చాలా అడ్డంకులు,సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించారు ఈ వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ(ఎం) గ్రేటర్‌ విశాఖనగర కమిటీ ఈరోజు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేసింది.

ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఆందోళన

ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఈ నెల 22న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ప్రదర్శన నిర్వహించనున్నారు.గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తామని చెప్పిన టిడిపి ప్రభుత్వం, 21 మాసాలు గడిచినా ఆ హామీని అమలు చేయలేదని వారు విమర్శించారు. 21 మాసాలలో పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలలో ఇళ్ల నిర్మాణం గానీ, స్థలాల కేటాయింపుగానీ జరగలేదని పేర్కొన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉండగా, పట్టాలు లేకుండా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నవారు కూడా ఉన్నారన్నారు.

పీర్‌లెస్‌ రక్షణ ప్రభుత్వ బాధ్యత..

దేశంలోని చిన్న మొత్తాల పొదుపు సంస్థలలో ప్రముఖ స్థానంలో ఉండి ఆర్‌బిఐ నిబంధనలకనుగుణంగా నడుస్తూ ప్రజాభిమా నాన్ని చూరగొన్న సంస్థ పీర్‌లెస్‌ జనరల్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ లిమి టెడ్‌. నిజాయితీగా తన ఖాతాదారులకు మెచ్యూరిటీ సొమ్మును అందిస్తున్న ఈ సంస్థ ఆర్‌బిఐ విధించిన ఆంక్షల ఫలితంగా తన వ్యాపారాన్ని 2011 ఏప్రిల్‌ 1 నుంచి ఆపేయాల్సి వచ్చింది. దీనితో పీర్‌లెస్‌ సంస్థ ద్వారా లబ్ధిపొందిన లక్షలాది మంది ఖాతాదారులు తిరిగి తమ డబ్బును పీర్‌లెస్‌ సంస్థలో పొదుపు చేసుకొనే అవకాశం కోల్పో యారు.

కులం కోసం కాదు.. కూటి కోసం

ప్రస్తుతం దేశంలో కుల, మతాల జాడ్యం పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ప్రజలు కులం కోసం కాకుండా, కూటి కోసం పోరాడాలని ప్రముఖ విప్లవ సినీ గేయ రచయిత వంగపండు ప్రసాద్‌ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడు పినిపే సత్యనారాయణ రాసిన 'ధిక్కార ఖడ్గం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.అంబేద్కర్‌ మనల్ని కులం కంటే కూటి కోసమే పోరాడాలని చెప్పారన్నారు. డబ్బుకు ప్రాణం లేకపోయినా అన్నింటినీ శాసిస్తుందన్నారు. 

Pages

Subscribe to RSS - March