March

జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై ఏబీవీపీ కేసులు..

జేఎన్‌యూ అడ్మినిసే్ట్రషన్‌పై చట్టపరమైన చర్యలకు అఖిల భారత విద్యార్థి పరిషత (ఏబీవీపీ) సన్నద్ధమైంది. అఫ్జల్‌ గురుపై ఫిబ్రవరి 9న నిర్వహించిన కార్యక్రమానికి అనుమతిచ్చినందుకు జేఎన్‌యూ అసోసియేట్‌ డీన్‌ పైన, భారత చట్టవిరుద్ధంగా కాశ్మీర్‌ను ఆక్రమించుకుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ప్రొఫెసర్‌ నివేదితా మీనన్‌ పైనా ఏబీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బిల్లులపై బిజెపి మల్ల గుల్లాలు..

పార్లమెంటు తొలివిడత బడ్జెట్‌ సమావేశాలు మరో మూడు పనిదినాల్లో ముగియనున్న నేపథ్యంలో కీలక బిల్లులకు ఆమోదంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజావేగుల రక్షణ(సవరణ) బిల్లు-2015, కాందిశీకుల ఆస్తుల(సవరణ, ఆమోదం) బిల్లు-2016వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే లోక్‌సభ ఆమోదించిన ఆధార్‌ బిల్లుకు రాజ్యసభలో, ఎగువసభ ఆమోదముద్ర వేసిన రియల్‌ ఎస్టేట్‌ బిల్లుకు లోక్‌సభలో అంగీకారం పొందాల్సి ఉంది. వీటితోపాటు మరికొన్ని చర్చనీయాంశాలు దిగువసభలో ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు ఏప్రిల్‌ 20 నుంచి పార్లమెంటు రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

RSS వాళ్ళు ప్యాంట్లు వేసుకున్నంత మాత్రాన..

నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు వేసుకున్నంత మాత్రాన స్వయం సేవక భావజాలం కగిన వ్యక్తులకు ఆధునిక భావజాలం ఒంటబట్టదని ఆర్ఎస్ఎస్‌పై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వంగ్య విమర్శలు చేశారు. ఫుల్‌ ప్యాంట్లు వేసుకున్నంత మాత్రానా ఆధునికులు కాలేరని, ఆలోచన ధోరణిలో మార్పు రావాలని లాలూ అన్నారు. కేవలం హిందూ వాదం ఒక్కటే ఆధునికత కాదని ఆర్జేడీ చీఫ్ చెప్పారు.

బెంగాల్లో తృణమూల్‌కి వ్యతిరేకంగా మావోలు..

‘జంగల్‌ మహల్‌’ ప్రాంతంలో తిరిగి పట్టు సాధించడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రహస్య ప్రచారం నిర్వహించాలని నిషేధిత సీపీఐ(మావోయిస్టు) భావిస్తోంది. జంగల్‌ మహల్‌గా పిలిచే పురులియా, బంకెరా, పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాల్లో సుమారు 40 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 30 స్థానాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది.

బడ్జెట్‌ సమావేశాలల్లో తేలనున్నGST..

జాతీయ వస్తు సేవల పన్ను(జిఎస్‌టి), బాంక్రప్టసి అండ్‌ ఇన్‌సాల్వెన్సీ బిల్లు రెండవ దశ బడ్జెట్‌ సమావేశాలలో ఆమోదం పొందుతాయనే ఆశాభావన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వ్యక్తం చేశారు. ఈ సమావేశాలు ఏప్రిల్‌ 20న ప్రారంభం కానున్నాయి. జిఎస్‌టి బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆమోదం పొందేందుకు సిద్ధంగా ఉన్నది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తరువాత అక్టోబరు 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ జరిగిన అడ్వాన్సింగ్‌ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ పై విషయాలు తెలిపారు.

33.83 లక్షల కోట్లపై DRI దర్యాప్తు..

UPA ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2004-13 మధ్య దేశం నుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన 505 బిలియన్‌ డాలర్ల (ప్రస్తుత విలువలో సుమారు రూ.33.83 లక్షల కోట్లు) డబ్బుపై రెవెన్యూ నిఘా విభాగ డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ) దర్యాప్తు ప్రారంభించింది. నల్లధనంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇచ్చిన ఆదేశాలతో డీఆర్‌ఐ రంగంలో దిగింది.

'ఉపాధి' పనులు తక్షణమే ప్రారంభించాలి.

జిల్లాలోని పేదలు కూలి పనుల నిమిత్తం వలసలు పోతున్నారని, వాటిని అరికట్టేందుకు తక్షణమే ఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కరువు విలయతాండం చేస్తుందని, ఈ పరిస్ధితుల్లో కూలి పనులు లేకపోవడంతో వేలాది మంది ఇతర జిల్లాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ఉపాధి హామీ నిధుల్లో 50శాతం సిసి రోడ్లకు ఖర్చు చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో చేపట్టే పనుల్లో యంత్రాలు ఉపయోగించ రాదనే నిబంధన ఉందని, కాని ఈ నిధులు సిసి రోడ్లకు ఖర్చు చేయడం నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్నారు.

Pages

Subscribe to RSS - March