
దేశంలో విద్యాలయాలపై ఆరెస్సెస్, బిజెపి ప్రభుత్వం జోక్యం వద్దని, విద్యా సంస్థలకు స్వతంత్ర ఇవ్వాలని డిమాండు చేస్తూ విద్యార్ధి లోకం పార్లమెంట్ మార్చ్ చేపట్టారు. దేశవ్యాప్తంగా వచ్చిన విద్యార్థి సంఘ నాయకులతో పార్లమెంట్ రోడ్డు కిక్కిసరిపోయింది. విద్యార్థుల చేపట్టే పార్లమెంట్ మార్చ్‌లో జెఎన్‌యు ప్రొఫెసర్ల సంఘం కూడా పాల్గొంది. దాదాపు రెండు వందల మంది జెఎన్‌యు ప్రొఫెసర్లు పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్నారు