March

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై BJP కసరత్తు

ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే భేటీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్లు పాల్గొంటున్నారు. నేషనల్ ఎగ్జిక్యూట్‌మెంట్ మీట్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభించారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. 

ఏప్రిల్‌ 2 రావాల్సిందిగా మాల్యాకు సమన్లు

తనకు మరింత గడువు ఇవ్వాలన్న విజయ్‌ మాల్యా విజ్ఞప్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మన్నించింది. దర్యాప్తు అధికారి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు గడువు పెంచింది. ఏప్రిల్‌ 2న రమ్మని తాజాగా సమన్లు జారీ చేసింది. అంతక్రితం సమన్ల ప్రకారం శుక్రవారమే (ఈనెల 18న) మాల్యా హాజరుకావాల్సి ఉంది. 

అమరావతిలో అత్యుత్తమ హైకోర్టు..

 అమరావతిలో ప్రపంచ అత్యుత్తమ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సు ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులు, ధర్మాసనాలు ఇచ్చే తీర్పులు సమాజానికి మార్గదర్శకాలు అని చంద్రబాబు అన్నారు

సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొవాలి

పేదలు ఐక్యంగా ఉండటం ద్వారా సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 9న రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన సుందరయ్య కాలనీ సిపిఎం నాయకుడు కె ఆంజనేయులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయిన సందర్బంగా గురువారం రాత్రి కాలనీలో బహిరంగ సభ నిర్వహించారు.

సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొవాలి

పేదలు ఐక్యంగా ఉండటం ద్వారా సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 9న రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన సుందరయ్య కాలనీ సిపిఎం నాయకుడు కె ఆంజనేయులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయిన సందర్బంగా గురువారం రాత్రి కాలనీలో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఆర్టీవో కార్యాలయం నుండి కాలనీకి ర్యాలీ నిర్వహించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఆంజనేయులుకు చికిత్స అందించి కోలుకునేట్లు చేయటంలో జిజిహెచ్‌ వైద్యుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరుతూ జివిఎంసి కార్యాలయం ముట్టడి

ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు  ఇవ్వాలని కోరుతూ జివిఎంసి కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బి. గంగారావు గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన క్రింద ఆన్‌లైన్‌ ద్వారా 1,84,424 మంది పేదలు  ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికి 80వేల మందికి సర్వే చేశారు. ఇందులో 64వేల మందికి ఆధార్‌, రేషన్‌ కార్డు సరిగ్గా లేవని చెప్పి తొలగించడం జరిగింది. అడ్రసు దొరకలేదని 40వేల వరకు తొలగించారు.  దీనీవల్ల అర్హులైనవారికి ఇళ్ళు వచ్చే అవకాశం సన్నగిల్లుతుంది. సర్వే కూడా సరిగ్గా చేయడం లేదు. సర్వేచేసిన వాటిని  కంపూటర్‌లో అప్‌లోడ్‌ చేయడంలేదు.

స్థ‌లాలు, ప‌ట్టాలు, రిజిస్ట్రేష‌న్‌లు కోరుతూ మార్చి 22న జ‌రిగే ఛ‌లో విజ‌య‌వాడ కార్యక్ర‌మం జ‌య‌ప్రదం చేయాల‌ని సి.పి.ఎం-సిపిఐ సైకిల్ ర్యాలి

 స్థ‌లాలు, ప‌ట్టాలు,  రిజిస్ట్రేష‌న్‌లు కోరుతూ మార్చి 22న జ‌రిగే ఛ‌లో విజ‌య‌వాడ కార్యక్ర‌మం జ‌య‌ప్రదం చేయాల‌ని సి.పి.ఎం-సిపిఐ సైకిల్ ర్యాలి

నక్కపల్లి 'హెటిరో' వద్ద ఉద్రిక్తత

- హెచ్‌ గేట్‌లో దారి మూసివేతకు నిరసనగా కార్మికుల ధర్నా
- మద్దతుగా నిలిచిన సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, ఎం.అప్పలరాజు
- దిగొచ్చిన యాజమాన్యం 

ఇళ్ళ‌ను కూల్చే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి. నోటీసులిస్తే తీసుకోం! `స్వాతి సెంటర్‌లో భవానీపురం కృష్ణాకరకట్ట వాసుల రాస్తారోకో `మద్దుతు పలికిన సిపిఎం

కొద్ది నెల్లో కృష్ణా పుష్కరాల‌ నేపథ్యంలో భవానీపురం కృష్ణా కరకట్ట వాసుల‌ను తొల‌గించే ఉద్దేశ్యంతో నగరపాల‌క సంస్థ అధికారులు బుధవారం హడావిడిగా ఇళ్ళ తొల‌గింపు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికు లు వారిని అడ్డగించి నోటీసులు తీసుకోం, మా ఇళ్లు తొల‌గించటానికి అంగీకరించమని పున్నమి హాోటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు సి.హెచ్‌. బాబూరావు సంఘటనా స్థలానికి చేరుకుని వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం స్థానికుల‌తో కలిసి కరకట్ట ప్రాంతంలో ప్రదర్శనగా బయలుదేరి స్వాతి సెంటర్‌కు చేరుకున్నారు. స్వాతి సెంటర్‌లో  రాస్తారోకో  నిర్వ‌హించారు.

Pages

Subscribe to RSS - March