March

విషం చిమ్ముతున్న దివిస్‌

 పరిశ్రమలొస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పాలకులు చెబుతున్న మాటలు భ్రమలు కల్పించేవి తప్ప భరోసా ఇచ్చేవి కావని అర్థమవుతోంది. నమ్మించి పారిశ్రామికవేత్తల అవసరాలు తీర్చడం కోసం ప్రజలతో ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలని అనుభవాలు చెబుతున్నాయి.

బాక్సైట్‌పై చంద్రబాబు కపటనాటకం

       విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని చెబుతున్న చంద్రబాబు, దానికి సంబంధించిన జిఒ 97ను రద్దు చేయకుండా కపట నాటకం ఆడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18న జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో బాక్సైట్‌కి సంబంధించి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలం నాటి, కాలం చెల్లిన 222, 289 జిఒలను రద్దు చేసి గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు.

బలవంతపు భూసేకరణ ఆపాలి

           సబ్బవరం మండలం, వంగలి రెవెన్యూ పరిధిలోని అసైన్డ్‌ భూముల్లో బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం హెచ్చరించారు. బలవంతపు భూసేకరణను నిరసిస్తూ, రీసర్వే నిర్వహించాలని కోరుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన వంగలి గ్రామ రైతులు తహశీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.

రోహిత్‌ చట్టం తెచ్చే వరకు పోరాటం..

రోహిత్‌ చట్టం తెచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని కన్నయ్యకుమార్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటానని కన్నయ్యకుమార్‌ చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానన్నారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఏడాదిలో పోస్టల్‌ బ్యాంకింగ్‌ సేవలు..

తపాల శాఖ మార్చి 2017 నుంచి పేమెంట్‌ బ్యాంక్‌ సేవాలను అందించనుందని కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఐటి శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇందుకోసం త్వరలోనే కేబినెట్‌ అనుమతి లభించనుందని పేర్కొన్నారు. బీమా, బ్యాంకింగ్‌ ఇతర సేవలకై 60 అంతర్జాతీయ సంస్థలు పోస్టల్‌ శాఖతో ఒప్పందాలు కుదర్చుకున్నాయని మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసిన డిజిటల్‌ ఇండియా సమ్మిట్‌ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భారత్‌లో కోర్‌ బ్యాంకింగ్‌ సేవల్లో తపాల శాఖ అతిపెద్ద నెట్‌వర్క్‌ కలిగి ఉంది.

జార్ఖండ్‌ సిఎంతో బృందాకారత్‌ భేటి..

సిపిఐ(ఎం) పొలిట ్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ మంగళవారం జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌తో భేటీ అయ్యారు. లతేహర్‌ జిల్లాలో మార్చి 18నజరిగిన ఇద్దరి హత్యపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. కరత్‌ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం రఘువర్‌ దాస్‌కు ఒక మెమోరాండంను సమర్పించింది. 32 ఏళ్ళ వయస్సు గల ఒక యువకుడు, 13 ఏళ్ళ వయస్సు గల బాలుడు హత్యోదంతంలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. హత్యకు గురైన వ్యక్తి భార్యకు, బాలుడి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. బృందాకరత్‌ సోమవారం లతేహర్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించారు.

కుహనా దేశభక్తుల ఆట కట్టించాలి..

కుహనా దేశభక్తి పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి కూటమి సాగిస్తున్న ఏడుపులను, గగ్గోలును సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు ఇంత హంగామా చేస్తున్న ఈ హిందూత్వ ప్రచారకులకు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న రికార్డు లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ పేర్కొన్నారు. పైగా దీనికి విరుద్ధంగా తనను వదిలిపెడితే బ్రిటీష్‌ పాలకులకు అవసరమైన సాయాన్ని అందిస్తానంటూ హిందూత్వ సిద్ధాంత వ్యవస్థాపకుల్లో ఒకరైన వీర్‌ సావర్కార్‌ ముందుకొచ్చారని విమర్శించారు. సామ్రాజ్యవాదాన్ని బుజ్జగించే విధానాన్ని అనుసరించే శక్తులు నిజమైన జాతీయవాదులు కాదని అన్నారు.

ఉగ్రవాది హెడ్లీ విచారణ ప్రక్రియ నేడే..

ముంబయి ఉగ్రదాడులకు సంబంధించి పాక్‌-అమెరికన్‌ ఉగ్రవాది డేవిడ్‌ హెడ్లీ విచారణ ప్రక్రియ నేటి  నుంచి జరుగుతుంది. ముందు ఖరారు చేసిన ప్రకారం మంగళవారం నుంచి జరగాల్సి ఉంది. హెడ్లీ న్యాయవాదుల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బుధవారం నుంచీ విచారణ ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరినట్లు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల్‌ నికమ్‌ తెలిపారు.

ప్రైవేట్‌ రిజర్వేషన్లతో నక్సలిజానికి చెక్‌పెట్టొచ్చట

ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నక్సలిజానికి చెక్‌ పెట్టవచ్చు. యువత నక్సలిజం వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు. దీనికి కారణం ఒక్కటే. సరైన ఉపాధి అవకాశాలు దొరకకపోవడమే. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ యువతలో ఉన్న ఆగ్రహావేశాలు తగ్గిపోతాయని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యానించారు 

Pages

Subscribe to RSS - March