టెక్నాలజీ మాటున మోడీ హిందూత్వం..

రాజ్యాంగంలో మనువాద భావజాలాన్ని జొప్పించి దేశాన్ని మరో పాకిస్థాన్‌గా మార్చేందుకు నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు విమర్శించారు. మనువాదాన్ని అమలు చేసిన మరుసటి రోజే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ు పరివారాన్ని ప్రజలు తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు. సాంకేతిక పరిజ్ఞానం మాటున హిందూత్వాన్ని ప్రజ లపై రుద్ది దేశాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు మోడీ యత్నిస్తున్నారని ఆరోపించారు.