
మోడిజీ ... అస్సాం టీని అమ్మినందువల్ల అస్సాంతో ప్రత్యేక అనుబంధం ఉందని మీరు చెప్పారు. అయితే, టీని ఉత్పత్తిచేసిన కార్మికులతో మీకు ఎటువంటి అనుబంధం లేదు. తేయాకు పనులు తప్ప మరోకటి తెలియని ఆరు గిరిజన జాతులను గిరిజనులుగా గుర్తించడానికి మీరు నిరాకరిస్తుండటమే దీనికి నిదర్శనం. మీ మోసపూరత చర్యలతో వారిని ఇంకా అవమానపరచకండి. గిరిజనులను మోసం చేయడం మానుకోండి' అస్సాం ఎన్నికల సభలో బృందాకరత్. ఎన్నికల బరిలో నిలిచిన 25 సంవత్సరాల సంగీతాదాస్‌కు మద్దతుగా ఆదివారం జరిగిన ఎన్నికల సభలో బృందాకరత్ పాల్గొన్నారు.