March

రాష్ట్రాల్లో కమల నాధుల అభివృద్ధి టూర్‌

ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి అజెండా ప్రచారానికి పార్టీ కూడా కృషిచేసేలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత షా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు పార్టీ బృందాన్ని పంపాలని నిర్ణయించారు. పార్టీలో ఆర్‌ఎ్‌సఎస్‌ నియమించే ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) రామ్‌లాల్‌ ఈ బృందంలో కీలక సభ్యుడు. మిగతా సభ్యులు కూడా దాదాపు సంఘ్‌ నుంచి వచ్చినవారే ఉంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. వీరు తరచూ రాష్ట్రాలకు వెళ్లి కనీసం మూడు రోజులు గడుపుతారు. ‘నాయకత్వ ఆలోచనలకు, క్షేత్రస్థాయిలో వాటి అమలుకు మధ్య అంతరం ఉండకూడదని అమిత షా భావిస్తున్నారు. 

JNU గూగుల్‌మ్యాప్ వివాదం RSS కుట్రే..

దేశవ్యతిరేకత,రాజద్రోహం వంటి పదాల ఆధారంగా గూగుల్‌మ్యాప్స్‌లో వెతికితే దిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) కనిపించటం శుక్రవారం వివాదాన్ని సృష్టించింది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర అని జేఎన్‌యూ విద్యార్థిసంఘం ఉపాధ్యక్షురాలు షేలా రషీద్‌ షోరా ఆరోపించారు. జేఎన్‌యూకు సంబంధించిన గూగుల్‌మ్యాప్స్‌ రివ్యూలను దేశవ్యతిరేకత, ఉగ్రవాదం వంటి పదాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులు పెద్దఎత్తున అనుసంధానించటం వల్లే ఇది జరిగిందన్నారు. 

APలో విద్యుత్ చార్జీల మోత దారుణం..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు దారుణంగా పెంచుతున్నారని ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచడం సరికాదన్నారు. తక్కువ ధరకు విద్యుత్ లభించినా డిస్కంలు ఎక్కువ ధరకు కొంటున్నాయని జగన్ మండిపడ్డారు.

మన్‌ కీ బాత్‌ కి మాత్రం ఈసీ అనుమతి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని సూచించింది. ప్రతినెల నిర్వహించే ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా కార్యక్రమ నిర్వహణకు ఈసీ బుధవారం అనుమతి ఇచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పీడీపీ, భాజపాల దోస్తీ కుదిరింది..!!

ప్రతిష్టంభనకు తెరదించుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేస్తూ పీడీపీ, భాజపాలు శనివారం రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రాను కలవనున్నాయి. దీంతో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. రాష్ట్రానికి ఆమె తొలి మహిళా ముఖ్యమంత్రి కానున్నారు.

దళితులపై దాడి అంటే దేశం వీుద దాడే

మతోన్మాదులు హైదరాబాద్‌లో కన్నయ్యుపై విసిరిన చెప్పు.. రాజ్యాంగంపై విసిరినట్టుగా తాము భావిస్తున్నామని అఖిల భారత దళిత హక్కుల ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. దళితులపై దాడి చేయుడం అంటే దేశం వీుద దాడి చేయుడవేునని అభిప్రాయుపడ్డారు. 

HCU పరిస్థితులపై రాష్ట్రపతితో ఏచూరి భేటీ

హెచ్ సీయూలో తాజా పరిస్థితులపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. హెచ్ సీయూలో వేముల రోహిత్‌ ఆత్మహత్య, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించారు. గత నెల 17 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను ప్రణబ్‌ దృష్టికి తెచ్చారు. హెచ్‌సీయూ ఘటనలపై జోక్యం చేసుకోవాలని కోరారు. హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ హిందూ రాష్ట్ర అభివృద్ధి మంత్రిత్వ శాఖగా మారకుండా చూడాలని సీతారాం ఏచూరి విన్నవించారు. 

2018 డిసెంబర్‌ నాటికి AP అసెంబ్లీ..

అమరావతి రాజధాని నగర తొలి నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. నేచర్‌, కల్చర్‌, ఫ్యూచర్‌ అనే మూడు కీలకాంశాల ఆధారంగా అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రణాళికను ఎంపిక చేశారు. తొలిదశలో ఐకానిక్‌ నిర్మాణాలుగా ఈ రెండింటినీ చేపట్టనున్నారు. 3.50 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ, తొమ్మిది లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మాణాలను చేపట్టానున్నారు. వీటికి సుమారు రూ.720 కోట్లు వ్యయం అంచనా వేశారు. ప్రతి నిర్మాణంపైనా సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ భవనాన్ని 210 కుర్చీల సామర్థ్యంతో నిర్మించను న్నారు. ఇది ఉద్దండ్రాయునిపాలెం వద్ద నిర్మాణమ వుతుంది.

అమరావతి భూసేకరణపై అసెంబ్లీలో రచ్చ

ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం ఎపి సర్కార్ జీవో నెంబర్ 110 ను విడుదల చేసింది ఏపీ రాజధాని అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములను జీవో 110 ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జీవో ద్వారా 99 ఏళ్ల వరకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు.

పన్ను మదింపుపై దర్యాప్తు జరపాలి

నర్సీపట్నం మున్సిపాలిటీలో పన్నుల మదింపులోనూ, డివిజన్ల ఏర్పాటులోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే దర్యాప్తు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ నోటీసులు ఇవ్వకుండా అపరాధ రుసుము వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. పన్నుల తగ్గింపునకు కృషి చేస్తానని, అపరాధ రుసుము కట్టనవసరం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు కూడా ప్రజల పక్షాన ఉండి పన్నులు తగ్గింపునకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు.

Pages

Subscribe to RSS - March