March

అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనానికి తీర్మానం చేయాలి:బాబూరావు

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల స్వాధీనానికి అసెంబ్లీలో తీర్మానం చేయా లని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూ రావు డిమాండ్‌ రూ.1200 కోట్ల విలువ చేసే హారు ల్యాండ్‌, కీసరలోని 200 ఎకరాల భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాల న్నారు. బాధితుల కోసం తక్షణమే రూ.2 వేల కోట్లతో ప్రభుత్వమే నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రిగోల్డ్‌ సంస్థకు ప్రభుత్వం అమ్ముడుపోయిందని, అందుకే ఏడాది పాటు కేసును తాత్సారం చేసిందని విమర్శించారు. డిజిపి జెవి రాముడు కూడా నిందితులకు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు.

నేడు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఛలో విజయవాడలో

పట్టణ, నగర ప్రాంతాల నివాసులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం ప్రదర్శన, బహి రంగ సభ ఏర్పాటు కానున్నాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి గాంధీనగర్‌లోని జింఖానా క్లబ్‌ వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు వామ పక్ష నాయకులు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పట్టణ, నగ ర ప్రాంత వాసులకు ఒక్క ఇంటినిగానీ, నివేశన స్థలాన్నిగానీ మంజూరు చేయలేదని నాయకులు విమర్శించారు. సుమారు పది లక్షల మంది ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం జన్మభూమి మాఊరు గ్రామసభలలో దరఖాస్తు చేసుకు న్నారు.

ఇళ్ళపట్టాలు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని మచిలీపట్న‌ ంలొ మున్సిపల్ కార్యాలయం వద్ద దర్నాలో మట్లాడుతున్న సి.పి. యం. జిల్లాకార్యదర్మి

ఇళ్ళపట్టాలు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని మచిలీపట్న‌ ంలొ మున్సిపల్ కార్యాలయం వద్ద దర్నాలో మట్లాడుతున్న సి.పి. యం. జిల్లాకార్యదర్మి ఆర్. రఘు, చౌటపల్లి రవి, కోడాలి.శర్మ

కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ర‌ద్దు చేయాలి.

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన,వినాశ‌క‌ర‌మైన‌,ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించే  కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ర‌ద్దు చేయాల‌ని సిపియం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌మ్‌.కృష్ణ‌మూర్తి డిమాంఢ్ చేసారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంకు వ్య‌తిరేకంగా సిపియం ప్ర‌జాసంఘాల ఆద్వ‌ర్య‌ములో  కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్ర‌భావిత గ్రామాల‌లోప‌ర్య‌టించారు.సిపియం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌మ్‌.కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రమ‌ని అన్నారు.కొవ్వాడ అణుపార్కు జిఓల‌ను ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేసారు.

నీరుగారుతున్న గృహ నిర్మాణం..

గుడిసెలులేని ఆంధ్రప్రదేశ్‌, పేదలకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ళు, 2022 నాటికి అందరికీ ఇళ్ళు అంటూ పాలకులు ఊదరగొడుతున్నారు. ప్రభుత్వాలు మారాయి. గృహనిర్మాణ పథకాల పేర్లు మారాయి. ఇందిరమ్మ, రాజీవ్‌ పథకాల స్థానంలో ఎన్‌టిఆర్‌ పథకాలొచ్చాయి. కానీ ప్రభుత్వాల తీరు మాత్రం మారలేదు. 22 నెలలు గడచినా తెలుగుదేశం, బిజెపి పాలనలో పేదలకు గూడు కల్పించడంలో వెనుకడుగే తప్ప ముందడుగు లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పేదలకు మూడు సెంట్ల ఇళ్ళ స్థలం, పక్కా ఇల్లు, మధ్యతరగతివారికి ప్రత్యేక గృహ పథకం పేరుతో వాగ్దానాల వర్షం కురిపించింది. ఈ కాలంలో ''గాలిమేడలే'' తప్ప ఇళ్ళ నిర్మాణం సాగలేదు.

ఉన్నత విద్యామండలి వివాదంపై సుప్రీం..

ఉన్నత విద్యా మండలిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య వాటాలు 52:48 నిష్పత్తిలో జరగాలని సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఖాతాల్లో ఇరు రాష్ట్రాలకు వాటా వుంటుందని స్పష్టం చేసింది. జస్టిస్‌ గోపాలగౌడ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఉన్నత విద్యామండలి కేసులో శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

JNU ఉమర్‌,అనిర్బన్‌లకు బెయిల్‌..

రాజద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న జేఎన్‌యూ రీసెర్చ్‌ స్కాలర్లు ఉమర్‌ ఖాలిద్‌, అనిర్బన్‌ భట్టాచార్యలకు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ 6 నెలల పాటు అమలులో ఉంటుంది. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా 'దేశ వ్యతిరేక' నినాదాలు చేశారన్న ఆరోపణలపై వారిని గత నెలలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అదనపు సెషన్స్‌ జడ్జి రీతీశ్‌సింగ్‌ ఇద్దరు స్కాలర్లను రూ. 25 వేల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తంలో జామీను ఇవ్వాలని ఆదేశిం చారు.

చిన్నపొదుపు మొత్తాల వడ్డీరేట్లపై కోత..

చిన్న పొదుపు మొత్తాల పథకాల వడ్డీరేట్లపై కోతపడింది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), కిసాన్‌ వికాస్‌ పత్ర (కేవీపీ), సీనియర్‌ సిటిజెన్ల డిపాజిట్లు సహా పలు పథకాలపై చెల్లించే వడ్డీరేట్లను ప్రభుత్వం తగ్గించి వేసింది. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 మధ్య కాలానికి పీపీఎఫ్‌పై వడ్డీరేటును ప్రస్తుతమున్న 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది.

పిల్లల చదువు బాధ్యత కార్పొరేట్లదేనట..!

త్రివిధ దళాలు, పోలీసు, పారా మిలిటరీ బలగాల్లో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాల పిల్లల చదువు సంధ్యల బాధ్యతను కార్పొరేట్‌ రంగం తీసుకోవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీర జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు ఆ రంగంలోని వారంతా చేతులు కలపాలిలని కేంద్ర హోం మంత్రి రాజనాథ్ వ్యాఖ్యానించారు..

 

2020 కల్లా భారత పరిశ్రమలపై 665 కోట్లు

వివిధ ప్రభుత్వ పథకాల్లో కంపెనీ పాత్రపై చర్చించడం కోసం అమెరికా టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో ఛైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శుక్రవారమిక్కడ కలిశారు. 2020 కల్లా భారత అంకుర పరిశ్రమలపై 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సిస్కో ప్రకటించింది. అంతే కాకుండా 2.5 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లూ తెలిపింది.

Pages

Subscribe to RSS - March