
తపాల శాఖ మార్చి 2017 నుంచి పేమెంట్ బ్యాంక్ సేవాలను అందించనుందని కమ్యూనికేషన్స్ అండ్ ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం త్వరలోనే కేబినెట్ అనుమతి లభించనుందని పేర్కొన్నారు. బీమా, బ్యాంకింగ్ ఇతర సేవలకై 60 అంతర్జాతీయ సంస్థలు పోస్టల్ శాఖతో ఒప్పందాలు కుదర్చుకున్నాయని మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో టైమ్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా సమ్మిట్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భారత్‌లో కోర్ బ్యాంకింగ్ సేవల్లో తపాల శాఖ అతిపెద్ద నెట్‌వర్క్ కలిగి ఉంది. 2014లో 230 శాఖలు మాత్రమే కోర్ బ్యాంకింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం 20,494 తపాల శాఖలు ఈ పరిధిలోకి వచ్చాయని చెప్పారు ఏప్రిల్ నాటికి 25,000 శాఖలను కోర్ బ్యాంకింగ్‌లోకి తీసుకురానున్నామని చెప్పారు.