March

మోడీజీ.. గిరిజనులను మోసం చేయకండి:బ్రిందా

మోడిజీ ... అస్సాం టీని అమ్మినందువల్ల అస్సాంతో ప్రత్యేక అనుబంధం ఉందని మీరు చెప్పారు. అయితే, టీని ఉత్పత్తిచేసిన కార్మికులతో మీకు ఎటువంటి అనుబంధం లేదు. తేయాకు పనులు తప్ప మరోకటి తెలియని ఆరు గిరిజన జాతులను గిరిజనులుగా గుర్తించడానికి మీరు నిరాకరిస్తుండటమే దీనికి నిదర్శనం. మీ మోసపూరత చర్యలతో వారిని ఇంకా అవమానపరచకండి. గిరిజనులను మోసం చేయడం మానుకోండి' అస్సాం ఎన్నికల సభలో బృందాకరత్‌. ఎన్నికల బరిలో నిలిచిన 25 సంవత్సరాల సంగీతాదాస్‌కు మద్దతుగా ఆదివారం జరిగిన ఎన్నికల సభలో బృందాకరత్‌ పాల్గొన్నారు.

'చోడవరం సుగర్స్‌' పాలకవర్గం రాజీనామా చేయాలి

        చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీలో జరిగిన అవినీతి బాధ్యత వహించి పాలకవర్గం రాజీనామ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. హుదూద్‌ తుపాన్‌ పంచదార అమ్మకాల్లో ఫ్యాక్టరీలో చోటు చేసుకొన్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. హుదూద్‌ తుపాన్‌లో రూ.100 కోట్లు నష్టం వచ్చినట్లు అప్పట్లో సుగర్స్‌ చైర్మన్‌ చెప్పారని, వెనువెంటనే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అంత నష్టం వాటిల్లలేదని, నష్టంపై స్పష్టత లేదని తెలిపారు. పంచదార అమ్మకాల్లో చోటుచేసుకున్న అవినీతిపై చేపట్టిన విచారణ కేవలం ఇన్సూరెన్స్‌ నేపథ్యంలోనే జరిగిందని చెప్పారు.

విజయవాడ,విశాఖ మెట్రోపై అనుమానాలు

అట్టహాసంగా నిర్మించాలని భావిస్తున్న విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైళ్లపై అనుమానాలు పెరుగుతున్నాయి. వాటికి నిధులు సమకూర్చాల్సిన ఆర్థిక సంస్థలే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తురడడం గమనార్హం. ఈ సందేహాలను నివృత్తి చేసేరదుకు రాష్ట్ర యంత్రారగం ఆయా సంస్థలకు వివరాలు సమర్పిరచేరదుకు సిద్ధమైనా, వాటిలో విశ్వసనీయత ప్రశ్నార్థకమే. ప్రధానంగా ఏ మెట్రో రైల్‌ నిర్మాణంలోనైనా భవిష్యత్‌లో పెరిగే ప్రయాణికుల రద్దీ అంచనాయే  కీలకం. 

టెక్నాలజీ మాటున మోడీ హిందూత్వం..

రాజ్యాంగంలో మనువాద భావజాలాన్ని జొప్పించి దేశాన్ని మరో పాకిస్థాన్‌గా మార్చేందుకు నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు విమర్శించారు. మనువాదాన్ని అమలు చేసిన మరుసటి రోజే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ు పరివారాన్ని ప్రజలు తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు. సాంకేతిక పరిజ్ఞానం మాటున హిందూత్వాన్ని ప్రజ లపై రుద్ది దేశాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు మోడీ యత్నిస్తున్నారని ఆరోపించారు.

జిఒ 97ను తక్షణమే రద్దు చేయాలి

విశాఖ మన్యంలోని బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 97ను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు.  చంద్రబాబునాయుడు బాక్సైట్‌ విషయంలో కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన జిఒలను రద్దు చేసి తను జారీ చేసిన జిఒ 97ను మాత్రం రద్దు చేయడం లేదని తెలిపారు. ఏదైనా జిఒ జారీ అయితే ఐదేళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత ఆ జిఒ ఆటోమెటిక్‌గా రద్దవుతుందని చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

వారికి అంబేద్కర్‌ అవసరం ఎందుకొచ్చింది?

అంబేద్కర్‌ గురించి అంద రూ మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అని, దళిత వర్గా ల పెన్నిధి అని కీర్తిస్తు న్నారు. రిజ ర్వేషన్లు ఎస్సీ, ఎస్టీల హక్కు అని ప్రధాని నరేంద్ర మోడీ కూడా తాజాగా ప్రస్తుతించారు. అంబే ద్కర్‌ను ఇప్పుడు జాతీయ పార్టీలు అన్నీ సొంతం చేసుకునే దిశలో పోటీపడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు బిజెపి ఈ విషయంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. అంబేద్కర్‌ పేరు చెప్పి ఓట్లు పొందే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందుకే సమయం వచ్చినప్పుడే కాకుండా అంబేద్కర్‌ పేరు చెప్పడానికి సమయం కొనితెచ్చుకుంటున్నారు.

రాష్ట్రాల్లో కమల నాధుల అభివృద్ధి టూర్‌

ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి అజెండా ప్రచారానికి పార్టీ కూడా కృషిచేసేలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత షా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు పార్టీ బృందాన్ని పంపాలని నిర్ణయించారు. పార్టీలో ఆర్‌ఎ్‌సఎస్‌ నియమించే ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) రామ్‌లాల్‌ ఈ బృందంలో కీలక సభ్యుడు. మిగతా సభ్యులు కూడా దాదాపు సంఘ్‌ నుంచి వచ్చినవారే ఉంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. వీరు తరచూ రాష్ట్రాలకు వెళ్లి కనీసం మూడు రోజులు గడుపుతారు. ‘నాయకత్వ ఆలోచనలకు, క్షేత్రస్థాయిలో వాటి అమలుకు మధ్య అంతరం ఉండకూడదని అమిత షా భావిస్తున్నారు. 

JNU గూగుల్‌మ్యాప్ వివాదం RSS కుట్రే..

దేశవ్యతిరేకత,రాజద్రోహం వంటి పదాల ఆధారంగా గూగుల్‌మ్యాప్స్‌లో వెతికితే దిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) కనిపించటం శుక్రవారం వివాదాన్ని సృష్టించింది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర అని జేఎన్‌యూ విద్యార్థిసంఘం ఉపాధ్యక్షురాలు షేలా రషీద్‌ షోరా ఆరోపించారు. జేఎన్‌యూకు సంబంధించిన గూగుల్‌మ్యాప్స్‌ రివ్యూలను దేశవ్యతిరేకత, ఉగ్రవాదం వంటి పదాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులు పెద్దఎత్తున అనుసంధానించటం వల్లే ఇది జరిగిందన్నారు. 

APలో విద్యుత్ చార్జీల మోత దారుణం..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు దారుణంగా పెంచుతున్నారని ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచడం సరికాదన్నారు. తక్కువ ధరకు విద్యుత్ లభించినా డిస్కంలు ఎక్కువ ధరకు కొంటున్నాయని జగన్ మండిపడ్డారు.

Pages

Subscribe to RSS - March