
జవహర్లాల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 1984 సిక్కుల ఊచకోతకూ, 2002 గుజరాత్ మారణహోమానికీ తేడా ఉందని పేర్కొంటూ కన్హయ్య చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. 1984 సిక్కుల ఊచకోత ఒక గుంపు పాల్పడితే...2002 గుజరాత్ మారణ హోమం వెనుక సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. అయితే కన్హయ్యకుమార్ వ్యాఖ్యలపై ఆయన మద్దతు దారులు సైతం విమర్శలు గుప్పించడంతో డిఫెన్స్ లో పడిన ఆయన తన మాటలను తప్పుగా అన్వయించారని వివరణ ఇచ్చారు.