
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్‌సియు) ఘటనపై ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశ, అంతర్జాతీయ విద్యా వర్గం ఈ ఘటనపై మండిపడింది. మోడీ సొంత రాష్ట్రం(గుజరాత్)లో హెచ్‌సియు విద్యార్థులకు మద్ధతుగా సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ గుజరాత్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్లూ, నల్సర్ యూనివర్శిటీల్లో కూడా హెచ్‌సియుకి మద్ధతుగా వివిధ రూపాల్లో సంఘీభావం తెలిపారు.