
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండతో తృణమూల్ అరాచక శక్తులు చెలరేగిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన పలువురు వామపక్ష కార్యక్తలు ఎన్నికల నేపథ్యంలో బయటకు వస్తున్నారు. ఎర్రజెండా సాక్షిగా పోరాటం కొనసాగిస్తామని ప్రతిన చేస్తున్నారు. ఇలా వస్తున్న వారు గతంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బలవంతంగా ఆక్రమించుకున్న తమ సంఘాల కార్యాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు.