Ap అసెంబ్లీ స్థానాల పెంపు..?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంచడంపై కేంద్ర హోంశాఖలో భిన్నాభి పాయాలున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమక్షంలో ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏకాభిప్రాయం సాధించేందుకు వివిధ మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమై నట్లు తెలిపారు. వీలైనంత త్వరలో అసెంబ్లీ స్థానాల పెంపు ప్రక్రియ పూర్తి కావస్తుందని చెప్పారు. 2026 వరకు అసెంబ్లీ స్థానాలు పెంచనవసరం లేదని ఏపి పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్‌ 26 పేర్కొంది. కానీ అదే చట్టంలో ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలని ఉందని వెంకయ్య చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు తెలంగాణలో 119 నుంచి 153కు స్థానాలు పెంచాలని విభజన చట్టం పేర్కొంద న్నారు. ఇదే అంశంపై కేంద్ర హోం మంత్రి, కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాస్తామని చెప్పారు.