March

ఇళ్ళ‌ను కూల్చే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి. నోటీసులిస్తే తీసుకోం! `స్వాతి సెంటర్‌లో భవానీపురం కృష్ణాకరకట్ట వాసుల రాస్తారోకో `మద్దుతు పలికిన సిపిఎం

కొద్ది నెల్లో కృష్ణా పుష్కరాల‌ నేపథ్యంలో భవానీపురం కృష్ణా కరకట్ట వాసుల‌ను తొల‌గించే ఉద్దేశ్యంతో నగరపాల‌క సంస్థ అధికారులు బుధవారం హడావిడిగా ఇళ్ళ తొల‌గింపు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికు లు వారిని అడ్డగించి నోటీసులు తీసుకోం, మా ఇళ్లు తొల‌గించటానికి అంగీకరించమని పున్నమి హాోటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు సి.హెచ్‌. బాబూరావు సంఘటనా స్థలానికి చేరుకుని వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం స్థానికుల‌తో కలిసి కరకట్ట ప్రాంతంలో ప్రదర్శనగా బయలుదేరి స్వాతి సెంటర్‌కు చేరుకున్నారు. స్వాతి సెంటర్‌లో  రాస్తారోకో  నిర్వ‌హించారు.

పేదలందరికి ఇళ్ళు, ఇళ్ళస్థలాలు, ఇండ్ల పట్టాలివ్వాలి.తహసీల్ధార్‌ కార్యాయం వద్ద దార్న

       
    ఈ రోజు పేదలకు ఇళ్ళు, ఇళ్ళస్థలాలు, ఇళ్ళ పట్టాలివ్వాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో విశాఖపట్నం అర్భన్‌ తహసీల్ధార్‌ కార్యాయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం మండల తహసీల్ధార్‌ గారికి  మెమోరాండం ఇవ్వడం జరిగింది.

విస్తృత చర్చ అవసరం..

దేశ న్యాయవ్యవస్థ విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోం దంటూ సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు మరోమారు న్యాయవ్యవస్థ పనితీరును చర్చనీయాం శం చేశాయి. అలహాబాద్‌ హైకోర్టుకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిజానికి ఈ తరహా చర్చ ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఎన్నోసార్లు ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఇలా చర్చ జరిగిన ప్రతిసారీ కాయకల్ప చికిత్సతో సరిపుచ్చడం అలవాటుగా మారింది. అయితే, గతానికి ఇప్పటికీ పెద్ద తేడానే ఉంది.

విద్యా సంస్థల్లో ఆరెస్సెస్‌ జోక్యం ఎందుకు

దేశంలో విద్యాలయాలపై ఆరెస్సెస్‌, బిజెపి ప్రభుత్వం జోక్యం వద్దని, విద్యా సంస్థలకు స్వతంత్ర ఇవ్వాలని డిమాండు చేస్తూ విద్యార్ధి లోకం పార్లమెంట్‌ మార్చ్‌ చేపట్టారు. దేశవ్యాప్తంగా వచ్చిన విద్యార్థి సంఘ నాయకులతో పార్లమెంట్‌ రోడ్డు కిక్కిసరిపోయింది. విద్యార్థుల చేపట్టే పార్లమెంట్‌ మార్చ్‌లో జెఎన్‌యు ప్రొఫెసర్ల సంఘం కూడా పాల్గొంది. దాదాపు రెండు వందల మంది జెఎన్‌యు ప్రొఫెసర్లు పార్లమెంట్‌ మార్చ్‌లో పాల్గొన్నారు

ఏపి హోదాపై కాంగ్ వంటరి పోరు..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ హామీ ఇచ్చాని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తెలిపారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కాంగ్రెస్‌ ఒంటరిగానే పోరాటం చేస్తోందన్నారు. 

నియంత్రణ,అభివృద్ధి బిల్లుకు ఆమోదం

 గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించే ‘స్థిరాస్తి(నియంత్రణ, అభివృద్ధి) బిల్లు-2013’కు పార్లమెంటు ఆమోదం లభించింది. నిర్మాణ రంగంలో పారదర్శకతను తీసుకొచ్చే దిశగా ఈ బిల్లు ఈ నెల 10న రాజ్యసభ ఆమోదం పొందగా... తాజాగా లోక్‌సభ మంగళవారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రపతిఆమోదం అనంతరం బిల్లు చట్టరూపం దాల్చనుంది.

తెలంగాణా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం..

ఏపీ రాష్ట్రంలో వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఘాటు పదాలు వాడడం..దీనికి స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై టి.కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగంలో సీఎం కేసీఆర్ విపక్షాలపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవర్ అభ్యంతరం తెలిపింది. సీనియర్ నేతలపై ఇలాంటి విమర్శలు చేయడం తగదని పేర్కొంది. దీనిపై స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సీమ సమస్యలపై చలో అసెంబ్లీ..

 రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నగరంలో వామపక్షాల కార్యకర్తలు కదంతొక్కారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవడంతో ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. వామపక్షాల నేతృత్వంలో 15 రోజుల పాటు సీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బస్సుయాత్ర సాగింది. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ-సాగునీటి ప్రాజెక్టులు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి.. డిమాండ్లతో వామపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి.

కన్నయ్యకు మాజీ సైనికోద్యోగి లీగల్‌ నోటీసు..

జెఎన్‌యు విద్యార్థ్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌కు మాజీ సైనికోద్యోగి ఒకరు లీగల్‌ నోటీసు పంపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున భద్రతా బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ కన్నయ్యకు ఈ నోటీసులు వచ్చాయి. మండి జిల్లాలో రిటైర్డ్‌ సుబేదార్‌ కెహన్‌ సింగ్‌ థాకూర్‌ ఈ నోటీసులు పంపారు. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా తమ వాణిని వినిపిస్తామంటూనే సైనికుల పట్ల తమకు గౌరవం వుందని అయితే కాశ్మీర్‌లో మహిళలపై భద్రతా బలగాలు అత్యాచారాలకు పాల్పడిన వాస్తవంపై తాము మాట్లాడతామని కన్నయ్య వ్యాఖ్యానించారు. 

శారద స్కాంపై BJP మౌనం ఎందుకు?

శారద చిట్‌ ఫండ్‌ స్కాంపై వాస్తవాలు వెలువడినప్పటికి బిజెపి ఎందుకు మౌనం దాల్చిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ పక్షనేత సీతారామ్‌ ఏచూరి ప్రశ్నించారు. రాజ్యసభలో ఈ అంశంపై చర్చల్లో బిజెపి నోరు మెదపలేదని దుయ్యబట్టారు. మంగళవారం పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏచూరి మాట్లాడారు. భారత దేశ రాజకీయ చరిత్రల్లో ఇంత వరకు ఇలా జరగలేదని, ఒకే కుంభకోణంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, మేయర్లు భాగస్వామ్యం ఉందని ద్వజమెత్తారు. శారద చిట్‌ ఫండ్‌ కుంభకోణంలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని, ఈ అంశంలో టిఎంసి, బిజెపి మిలాఖత్‌ అయినట్లు తెటతెల్లం అయ్యిందని దుయ్యబట్టారు.

Pages

Subscribe to RSS - March