నేడు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఛలో విజయవాడలో

పట్టణ, నగర ప్రాంతాల నివాసులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం ప్రదర్శన, బహి రంగ సభ ఏర్పాటు కానున్నాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి గాంధీనగర్‌లోని జింఖానా క్లబ్‌ వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు వామ పక్ష నాయకులు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పట్టణ, నగ ర ప్రాంత వాసులకు ఒక్క ఇంటినిగానీ, నివేశన స్థలాన్నిగానీ మంజూరు చేయలేదని నాయకులు విమర్శించారు. సుమారు పది లక్షల మంది ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం జన్మభూమి మాఊరు గ్రామసభలలో దరఖాస్తు చేసుకు న్నారు. ఏ ఒక్కరికీ ఇల్లు, స్థలం రాకపోయినా, వచ్చిన అర్జీలను 85 శాతం పరిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొనటం గమనార్హమన్నారు.