
రాజద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న జేఎన్‌యూ రీసెర్చ్ స్కాలర్లు ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్యలకు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ 6 నెలల పాటు అమలులో ఉంటుంది. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా 'దేశ వ్యతిరేక' నినాదాలు చేశారన్న ఆరోపణలపై వారిని గత నెలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదనపు సెషన్స్ జడ్జి రీతీశ్‌సింగ్ ఇద్దరు స్కాలర్లను రూ. 25 వేల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తంలో జామీను ఇవ్వాలని ఆదేశిం చారు.