
పఠాన్కోట్ తీవ్రవాద దాడికి సంబంధించి పాకిస్తానీ దర్యాప్తు బృందం పర్యటన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ఆ ఎన్కౌంటర్లో మరణించిన నలుగురు తీవ్రవాదుల ఫోటోలను విడుదల చేసింది. ఆ తీవ్రవాదుల ఎత్తు, ఇతర వివరాలను వివరిస్తూ ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. వారిలో ఒక తీవ్రవాదికి రెండు కాళ్ళకు బొటనవేలు లేదని కూడా తెలిపింది. ఈ చిత్రాను విడుదల చేస్తూ ఇంకా ఇతరత్రా సమాచారం ఏమైనా తెలిసివుంటే పంచుకోవాల్సిందిగా ప్రజలను కోరింది. సంబంధిత సమాచారాన్ని ఇస్తే వారికి లక్ష రూపాయిల వరకు బహమతి ఇవ్వబడుతుందని ఎన్ఐఎ తెలిపింది.