
దేశంలో నానాటికీి పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగంపౖౖె పోరాడాలని యువజన సంఘాల సదస్సులో సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలో గాలిబ్ హాల్‌లో 13 వామపక్ష, ప్రజా తంత్ర యువజన సంఘాలు సంయుక్త జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మతతత్వ ఎజెండాను ఈ సదస్సు ఖండించింది.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏచూరి మాట్లాడుతూ, దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజలపై సరికొత్త దాడికి పూనుకుందని, ప్రజల మధ్య విచ్ఛిన్నకర భావాలను ప్రేరేపించి, విభజిం చు..!పాలించు..! విధానాన్ని అమలుచేస్తోందని విమర్శించారు.